వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిబియాలో కిడ్నాప్: శ్రీకాకుళం, హైద్రాబాద్‌వాసులు సహా వీరే, గోపీకృష్ణ భార్య ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: లిబియాలో అపహణకు గురైన వారిలో ముగ్గురు కర్నాటక వాసులు, ఒకరు తెలంగాణవారిగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వాసులు అని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని, అందులో ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వారు ఉన్నారని చెప్పారు. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

కిడ్నాపైన తెలుగువారిలో గోపీకృష్ణ, బలరామ్ ఉన్నారు. గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లా టెక్కలివాసి. కాగా, బలరాం హైదరాబాదుకు చెందిన వారు. కర్నాటకకు చెందిన ఇద్దరి పేర్లు... లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లుగా తెలుస్తోంది.

Two abducted indians are from Hyderabad

నా భర్త కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం వచ్చింది: కళ్యాణ్

తన భర్త గోపీకృష్ణను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం అందిందని గోపీకృష్ణ భార్య కళ్యాణ్ చెప్పారు. విధులకు వెళ్తుండగా డ్రైవర్‌‍ను దించి వెళ్తుండగా కిడ్నాప్ జరిగిందని తెలుస్తోందన్నారు.

గోపీకృష్ణ ఏడేళ్లుగా లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని చెప్పారు. తన భర్తను విడిపించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు కిడ్నాప్ చేసారనే విషయం తెలియాల్సి ఉందని, ఐసిస్ తీవ్రవాదులుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఎవరు చేశారో తెలియాల్సి ఉందని గోపీకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

English summary
The government of India says that the out of the four Indians abducted in Libya, two are from Karnataka and two are from Hyderabad. Efforts are on to secure their release, the government also says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X