హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్‌పై స్వారీ చేస్తూ లేడీ టెక్కీలను దోచుకున్న చైన్ స్నాచర్లు వీరే (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బైక్‌పై ప్రయాణిస్తూ మహిళల మెడల్లోని గొలుసులను లాక్కుపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసారు. మంగళవారం రాత్రి ఆ ఇద్దరిని స్థానికుల సాయంతో పోలీసులు పట్టుకున్నారు.

అప్పటికే రెండు నేరాలు చేసి మూడో నేరం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారు స్థానికులకు చిక్కారు. స్థానికులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులను కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండకు చెందిన తాడిశెట్టి నాగబాబు (22), కూకట్‌పల్లిలోని విజయనగర్ కాలనీకి చెందిన షాన్ హుస్సేన్ (21)లుగా గుర్తించారు.

మంగళవారం రాత్రి వారిద్దరు బైక్‌పై ప్రయాణిస్తూ ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను దోచుకున్నారు. ఐటి కారిడార్‌లో ఇది 15 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న అశ్విని మాదాపూరులోని తన హాస్టల్‌కు వెళ్లడానికి బస్సు కోసం కార్యాలయం నుంచి విప్రో జంక్షన్‌కు వెళ్తుండగా నిందితులు ఆమెను దోచుకున్నారు.

కేకలు వేయడంతో...

కేకలు వేయడంతో...

అశ్విని కేకలు వేయడంతో కొంత మంది 100కు పోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే మరో టెక్కీని దోచుకున్నారు.

ఇలా మరో టెక్కీ విషయంలో....

ఇలా మరో టెక్కీ విషయంలో....

కార్వీ సొల్యూషన్ ఎదుటి నుంచి నడుస్తుండగా ఆ ఇద్దరు దొంగలు మరో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గొలుసు లాక్కుని పారిపోయారు.

ఆ తర్వాత...

ఆ తర్వాత...

ఆ తర్వాత ఇద్దరు చైన్ స్నాచర్లు ట్రిపుల్ ఐటి వైపు వెళ్తూ హిల్ రిడ్జ్ విల్లాస్ వద్ద నడుస్తూ వెళ్తున్న మరో మహిళ చైన్ లాగడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.

వెంబడించారు...

వెంబడించారు...

కొంత మంది ప్రజలు, పోలీసులు వారిని వెంబడించారు. పోలీసులు రోడ్డును బ్లాక్ చేశారు. వారిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు తమ ఆనవాళ్లు చెప్పడానికి నిరాకరించారు.

English summary
Gachibowli police arrested two chain snatchers who had struck twice in the IT corridor on Tuesday night, with the help of citizens. The duo was going to commit a third offence when two citizens caught them and informed the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X