వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం మత్తులో కారుతో ఢీకొట్టాడు: ఫ్లైఓవర్ నుంచి స్కూటీ కిందపడి ఇద్దరు మృతి

కరీంనగర్‌లో హైదరాబాద్ ప్రమాదం రిపీట్ అయింది. ఓ కారు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఇద్దరు మరణించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదు నగరంలో కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన పునరావృతమైంది. ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దాంతో స్కూటీపై ఉన్న తండ్రీకొడుకులు ఫ్లైఓవర్ నుంచి కిందపడి ప్రాణాలు వదిలారు.

ఆ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. మద్యం మత్తులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారును వేగంగా నడిపి స్కూటీని ఢీకొట్టాడు. స్కూటీపై వెళ్తున్న వారిలో అక్కడికక్కడ తండ్రి, చికిత్స పొందుతూ కొడుకు మరణించాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అబ్దుల్ సాజిద్ (30) కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు.

Two die as car collides scooty on flyover at Karimnagar

తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆదివారం భార్యాపిల్లలతో కలిసి బైక్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్నాడు. నగర శివారులోని ైప్లెఓవర్ మీదికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొంది.

దీంతో సాజిద్, అతడి భార్య రజియా సుల్తానా (25), కొడుకు వాజిద్(3) ైఫ్లె ఓవర్ నుంచి పడిపోయారు. మరో చిన్న కూతురు ముస్కాన్ (1)ైఫ్లె ఓవర్‌పైనే పడిపోయింది. ఈ ఘటనలో సాజిద్ అక్కడికక్కడే చనిపోగా, భార్యాపిల్లలను ఆస్పత్రికి తరలించారు. వాజిద్ చికిత్స పొందుతూ మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిన్నారి ముస్కాన్ ప్రాణాలతో బయటపడింది.

సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఆరిఫ్ ఆస్పత్రికి వెళ్లి, క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి రజియాను మరో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ గౌడ్ తెలిపారు.

English summary
Father and son dead due to the collision of a car from backside with Scooty on flyover at karimnagar of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X