• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫిలింనగర్ దుర్ఘటనపై కేటీఆర్ సీరియస్, కేఎస్ రామారావుపై కేసు

|

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిలిం నగర్ దుర్ఘటన పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ జిహెచ్ఎంసి కమిషనర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఇంజినీర్, కాంట్రాక్టర్, ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు.

Also Read: ఫిలింనగర్లో కుప్పకూలిన భవనం, శిథిలాల కింద కూలీలు, చిత్ర పరిశ్రమదేనా?

ఈ ప్రమాదంలో సెంట్రింగ్ కార్మికులు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోర్టికో పైభాగంలో ఉన్న శ్రీనివాస్, మోనప్ప శివ, మల్లేశం, మండల్, కోటేశ్వర రావు, సీతారామ్, అజిత బిశ్వాస్, అశోక్, సరస్వతి తదితరులు గాయపడ్డారు. కార్మికుల్లో ఎక్కువ మంది బెంగాల్‌కు చెందిన వారు కాగా, ఏపీ, కర్నాటకలకు చెందిన వారు కూడా ఉన్నారు.

కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లోని గేట్ 1 నుంచి లోపలికి ప్రవేశించే మార్గంలో వర్షానికి తడవకుండా గతంలో పోర్టికో నిర్మించారు. అది సరిగా లేకపోవడంతో భవనం నుంచి గేటు వరకు కప్పుతూ పోర్టికోను విస్తరిస్తున్నారు. పాత పోర్టికో మీదనే శ్లాబు నిర్మాణ పనులు ప్రారంభించారు.

 కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

గేట్‌ ముందు శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి పనులు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం పదకొండున్నర గంటల ప్రాంతంలో పోర్టికో కదలడం ప్రారంభించింది. కార్మికులు తేరుకునేలోగానే ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు మృతి చెందారు.

కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

జాతీయ విపత్తు నిర్వహణ దళంతోపాటు పలు విభాగాల సిబ్బంది శిథిలాలు తొలగించి వాటి కింద ఇంకెవరూ లేరని తేల్చారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్ రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు.

కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, కిషన్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, భట్టి విక్రమార్క, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఘటనాస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు సాంస్కృతిక కేంద్రం నిర్వాహకులు అంగీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని మేయర్‌ రామ్మోహన్‌ ప్రకటించారు.

కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

ఈ నిర్మాణ బాధ్యతలను బెంగాల్‌కు చెందిన సుఖ్‌చంద్‌ చేపట్టారు. శ్లాబు వేసిన అనంతరం కొద్ది రోజులు ఆరనివ్వాలి. పది రోజులైనా గడవక ముందే శనివారం రాత్రి నుంచే పనులు ప్రారంభించారు. దీంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదని, జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్డుకుంటారనే హడావుడిగా పనులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

 కూలిన పోర్టికో

కూలిన పోర్టికో

అలాగే, డిజైనింగ్ లోపం ఉందని అంటున్నారు. పోర్టికో నిర్మాణం కోసం 14 పిల్లర్లు పోయగా కూలిన ఓ పిల్లర్‌లో ప్లాస్టిక్ పైపులు, ఇసుక కనిపిస్తుండడంతో నాణ్యతా లోపం కనిపిస్తోందని చెబుతున్నారు.

కేసులు

కేసులు

కాగా, ఘటన పైన జీహెచ్ంఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఫిర్యాదు మేరకు నిర్మాణదారు కొండల్రావు, ఇంజినీర్ సుధాకర్ రావు, సాంస్కృతిక కేంద్రం సొసైటీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యదర్శి రాజేశ్వర రావుల పైన కేసు నమోదు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An under-construction portico inside the Film Nagar Cultural Centre here collapsed on Sunday, leading to the death of two workers. Anshoor Shaik and Anand, both 35, died when the pillars meant to support the slab being laid at the entrance to the popular club, gave way around noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more