వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు పోస్టు చేసి ఇలా...పోలీసులు అలా...

సరదా కోసమే వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు, ఫోటోలను పోస్టు చేసిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్ సభ్యులు అభ్యంతరం తెలిపితే పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు , పోటోలు పోస్టు చేసినందుకు ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. .సరదా కోసమేనని తాము అశ్లీల వీడియోలు, ఫోటోలను వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేసినట్టుగా నిందితులు చెప్పారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

తెలంగాణ కార్ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ లో సుమారు 111 మంది వాట్సాప్ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో సభ్యులుగా ఉన్న డ్రైవర్లు రఘునాథ్ రెడ్డి, సిద్దమ్ శ్రీధర్ అశ్లీల వీడియోలు , ఫోటోలు పోస్టు చేస్తున్నారు.

ఈ విషయమై గ్రూప్ సభ్యుల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఓలా , ఉబేర్ క్యాబ్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న ఈ గ్రూప్ లో ఈ రకమైన అశ్లీల వీడియోలను, ఫోటోలను వీరిద్దరూ పోస్టు చేస్తున్నారు.గ్రూప్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

two drivers arrested for posting obscene videos in whats app group

ఈ నెల 14వ, తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే కేసు నమోదు చేసిన ఇన్స్ పెక్టర్ రియాజుద్దీన్ నేతృత్వంలోని బృందం నిందితులను శనివారం నాడు అదుపులోకి తీసుకొంది.

సరదా కోసమే తాము ఈ వీడియోలను గ్రూప్ లో పోస్టు చేసినట్టుగా చెప్పారు. అశ్లీ వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం నేరమే. అయితే ఆయా వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు అభ్యంతరం చెబితే చర్యలు తీసుకొంటామని పోలీసులు చెప్పారు.

English summary
two drivers arrested for posting obscene videos in whats app group.raghupal reddy and sridhar arrested for posting obscene videos in whats app group.they are working as drivers in uber company, some group members compliant to police about obscene videos in whats app group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X