ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు ఎమ్మెల్సీ స్థానాలు.!పది మంది ఇంఛార్జ్ మంత్రులు.!క్షేత్రస్థాయిలో శ్రమిస్తుంది నలుగురే.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో ఊహించని విధంగా ఆదిత్యం కోల్పోవడం వంటి పరిణామాల తర్వాత జరుగుతున్న పట్ట భద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు స్థానాలకు సుమారు పది మంది మంత్రులకు అనూహ్య బాద్యతలను కట్టబెట్టారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. కాగా క్షేత్ర స్థాయిలో ఓ నలుగురు మంత్రులు మినహా మిగతా మంత్రుల పనితీరుపై ఆశించినంత స్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఎమ్మెల్సీ అభ్యర్దుల గెలుపుకోసం పదిమంది మంత్రులు.. కష్టపడుతుంది మాత్రం కొద్దిమందే..

ఎమ్మెల్సీ అభ్యర్దుల గెలుపుకోసం పదిమంది మంత్రులు.. కష్టపడుతుంది మాత్రం కొద్దిమందే..

పట్టభద్రుల ఎన్నికలల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్దులు కూడా ఈ సారి పెద్ద ఎత్తున రంగంలో దిగారు. పట్టభద్రులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విచక్షణతో ఓటేస్తారు కాబట్టి తమ గెలుపు ఖాయమని ప్రతి అభ్యర్ధి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రజాక్షేత్రంలో ఉన్న వారితో పాటు పాత్రికేయులు కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా పోటీలో నిలుస్తున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి.

 అధికార గులాబీ పార్టీ అవిశ్రాంత శ్రమ.. క్షేత్ర స్దాయిలో కష్టపడుతున్న ట్రబుల్ షూటర్..

అధికార గులాబీ పార్టీ అవిశ్రాంత శ్రమ.. క్షేత్ర స్దాయిలో కష్టపడుతున్న ట్రబుల్ షూటర్..

అందరు అభ్యర్తులు గెలుపును కోరుకుంటున్నట్టే అధికార గులాబీ పార్టీ కూడా తమ గెలుపుకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాభిమానాన్ని కోల్పోయిందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొంది ప్రజలు తమవెంటే ఉన్నారని ఇతర పార్టీలకు గొంతెత్తి చెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది అధికార గులాబీ పార్టీ. అందులో భాగంగానే మరోసారి సెంటుమెంటుకు ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ పార్టీ మూలాలున్న వాణీదేవీని అధికార పార్టీ తరుపున హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్ధిగా చాకచక్యంగా రంగంలో దించారు సీఎం చంద్రశేఖర్ రావు. ఈవిడ గెలుపుకోసం ఐదుగురు మంత్రులకు అదనపు బాద్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి.

 చురుగ్గా పనిచేస్తున్న సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి.. మిగతా మంత్రులు నామమాత్రమే..

చురుగ్గా పనిచేస్తున్న సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి.. మిగతా మంత్రులు నామమాత్రమే..

హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్ధి గెలుపుకోసం మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస గౌడ్ తో పాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి బాద్యతలు కట్టబెట్టారు ముఖ్యమంత్రి. అటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పువ్వాడ అజయ్ కుమార్ బాద్యతలు తీసుకునన్నారు. కాగా ఇంత మంది మంత్రుల్లో అందరూ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్ర స్దాయిలో శ్రమిస్తున్నారా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. పది మంది మంత్రుల్లో కేవలం నలుగురు మంత్రులు మాత్రమే
చురుగ్గా పనిచేస్తున్నట్టు గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

 అధికార పార్టీ నేతల అలసత్వం.. ప్రతికూల ఫలితాలొస్తే ప్రమాదమే..

అధికార పార్టీ నేతల అలసత్వం.. ప్రతికూల ఫలితాలొస్తే ప్రమాదమే..

వాణీదేవి విజయాన్ని మంత్రి హరీష్ రావు పూర్తిగా తన బుజాల మీద వేసుకున్నట్టు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకూ తన వ్యూహాలను అమలు చేసే హరీష్ రావు ప్రస్తుతానికి క్షేత్రస్దాయిలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 10వేల ఓట్లు ఉన్న సగ్మెంట్ లో గంటలు గంటలుగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావే ఇంతగా శ్రమిస్తుంటే మిగతా మంత్రుల పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. వీణాదేవికి విజయం కోసం ఐదుగురు మంత్రులను నియమించినా అందులో ఇద్దరే యాక్టీవ్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్ మినహా మిగతా ముగ్గురు మంత్రులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు వరంగల్, ఖమ్మం, నల్లగొండలో అభ్యర్ది గెలుపుకోసం మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మినహా మిగతా మంత్రులు తూతూ మంత్రంగా పనిచేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మిగిలి ఉన్న మరో ఐదు రోజులు మంత్రుల వ్యవహారం ఇలాగే కొనసాగితే అధికార గులాబీ పార్టీకి మరో కుదుపు తప్పదనే చర్చ జరుగుతోంది.

English summary
Chief Minister Chandrasekhar Rao has committed unpredictable responsibilities to about ten ministers for the two MLC seats.At the field level, Only four ministers have been performing as well as expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X