సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: రెండు నెలల పసికందును నీటి ట్యాంకులో పడేశారు, మేనమామ, మేనత్తే నిందితులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటిపైఉన్న నీటి ట్యాంకులో 2 నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఈ దారుణానికి పాల్పడింది చిన్నారి తల్లిదండ్రుల మేనమామ, మేనత్తే కారణమని పోలీసులు విచారణలో తేలింది.

తెల్లారేసరికి కనిపించని శిశువు..

తెల్లారేసరికి కనిపించని శిశువు..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, గురువారం రాత్రి కుటుంబసభ్యులతోపాటు నిద్రించిన ఆ బాలుడు.. శుక్రవారం తెల్లవారుజామున కనిపించలేదు. దీంతో శిశువుకు తీవ్రంగా గాలించిన తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

రెండు బాబును చంపి.. నీటి ట్యాంకులో పడేశారు

రెండు బాబును చంపి.. నీటి ట్యాంకులో పడేశారు


సీసీ ఫుటేజీ పరిశీలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు బాలుడి ఇంట్లోనే అణువణువు గాలించారు. చివరకు ఇంటిపైన వెతకగా.. నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది. ట్యాంకు నుంచి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేనమామ, అత్తే హత్య చేసుకుంటారన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే చిన్నారి హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వారే పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

Telangana MLC Polling 2nd Round Update : TRS Leads In Both Graduates’ MLC Seats
చితిపేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

చితిపేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంటిని ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసుకోవడంతో ఆవేదనకు గురైన ఓ వృద్ధుడు చితిని పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేములఘాట్‌కు చెందిన మల్లారెడ్డి(70) భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. కూతురు కుమారుడు అప్పుడప్పుడు తాత వద్దకు వచ్చి వెళుతూ ఉండేవాడు. కాగా, మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కూడా చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిలోనే ఉంటున్నాడు. అయితే, ఒంటరివాడు అనే కారణంతో ఇచ్చిన ఇంటిని అధికారులు వెనక్కి తీసుకున్నారు. అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితిపేర్చుకుని.. కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

English summary
Two month baby boy killed by his relatives, dead body found in a water tank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X