హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాంబులు ఎక్కడ పేల్చాలనుకున్నారో గుర్తించాం: ఐసిస్‌పై ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాతబస్తీలో తొలుత పలువురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. వారు దేశంలో బాంబులు పేల్చలనుకున్న ప్రాంతాలను గుర్తించారు. ఐసిస్ సానుభూతిపరులు సంచరించిన ప్రాంతాలను ఎన్ఐఏ అధికారులు గుర్తించి, వారు సంచరించిన చోట సిసిటివి ఫుటేజీలను సేకరించారు.

హైద్రాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్గత నెల 30వ తేదీన అయిదుగురిని, ఇటీవల ఇద్దరిని అరెస్టు చేశారు. అయిదుగురిని తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు వారిని విచారించిన అనంతరం మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. అయిదుగురిని విచారించిన అధికారులు కీలక విషయాలను వారి నుంచి రాబట్టారు.

Two More Arrested In Hyderabad, Moneybags Of ISIS, Say Sources

కస్టడీ నివేదికను కోర్టులో అధికారులు దాఖలు చేశారు. సానుభూతిపరులు ఈ మెయిల్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్ మీడియా ద్వారా విదేశాల్లోని ఏఏ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపారన్న విషయాన్ని తెలుసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.

నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, తదితర సామాగ్రిని ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో నిర్ధారించినట్లు తెలిపారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని విశ్లేషణ నిమిత్తం కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ లేబొరేటరీలకు పంపినట్లు చెప్పారు.

ఐసిస్ వైపు..: కేరళలో 17 మంది గాయబ్, ఇద్దరు గర్భవతులేనిందితులకు ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఎన్ఐఏ అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇటీవల అరెస్టైన ఇద్దరితో పాటు గతంలో అరెస్టు చేసిన ఇబ్రహీం ఎజ్దానీ, ఇలియాస్‌ ఎజ్దానీలను కూడా మరో 8 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు.

English summary
Two More Arrested In Hyderabad, Moneybags Of ISIS, Say Sources
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X