హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురోగతి: ఎంసెట్ 2 లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లు అరెస్ట్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులో అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో పాటు జార్ఖండ్ రాంచీకి చెందిన శ్యాం యాదవ్ అలియాస్‌ గుడ్డూ అనే వ్యక్తిని సోమవారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.

<strong>ఎంసెట్ 2 రద్దు, 200 మంది పేరెంట్స్‌కు శిక్ష తప్పదు: కేసీఆర్</strong>ఎంసెట్ 2 రద్దు, 200 మంది పేరెంట్స్‌కు శిక్ష తప్పదు: కేసీఆర్

నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్నాడు. విచారణలో భాగంగా రామకృష్ణ ఎన్‌ఐఎన్‌లో రీసెర్చి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇక ముంబైకి చెందిన గుడ్డూ ఎంసెట్ 2 స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు.

Two more brokers arrested in EAMCET-II paper leak case

అయితే ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మయాంక్‌సింగ్‌కు అనుచరుడు. పరీక్షకు ముందు ముంబైలో 8 మంది విద్యార్ధులు ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటులో శ్యాం యాదవ్ కీలక పాత్ర పోషించాడని అధికారులు గుర్తించారు.

<strong>ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే</strong>ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

అంతేకాకుండా నలుగురు విద్యార్ధుల నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసి, ఆ మొత్తాన్ని మయాంక్‌ సింగ్‌కు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఇక రామకృష్ణ విషయానికి వస్తే నలుగురు విద్యార్ధులను షిరిడీలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాడు.

English summary
Two more persons were arrested by Telangana CID in connection with the leak of EAMCET-II question paper, taking the number of those held in the case to eight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X