వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ కాంగ్రెస్ నుండి మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు ఔట్..! ఎన్నిక‌ల ముందు మ‌రో దెబ్బ‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నుంచి వీడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్లు, జూనియ‌ర్లు అని తేడా లేకుండా అంద‌రూ కారెక్కేస్తున్నారు. ఇద్దరు సీనియ‌ర్ నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు సీనియర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాబోతున్నారు. దీంతో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఫిరాయింపులు శ‌రాఘాతంగా ప‌రిణ‌మించాయి.

సిఎమ్ కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయిన రేవంత్ రెడ్డి, సిఎమ్ కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయిన రేవంత్ రెడ్డి,

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా సమర్పించారు. పార్టీ కోసం ఎంత నిబద్దతతో పనిచేసినా త‌న పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని ఆనంద భాస్కర్ ఆరోపించారు. విధేయులను మరిచి పార్టీ ఏక పక్షంగా వ్యవరిస్తుంద‌న్నారు.

two more senior out from t congress..! problem for t congress before lok sabha polls..!!

ఏ పార్టీలో చేరతానని ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న త‌న‌ను కావాలనే పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఓబీసీ ఛైర్మన్ పదవికి కి రాజీనామా చేసినట్లు చిత్తరంజన్ దాస్ ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా గుర్తింపు ఉంది. గతంలో టీడీపీ అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ ను ఓడించిన చరిత్ర చిత్తరంజన్ దాస్ కు ఉంది. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని చిత్తరంజన్ దాస్ ప్రకటించారు.

English summary
Telangana Congress Party former MP Rapolu Ananda Bhaskar and former minister Chittaranjan Das resigned. Ananda Bhaskar has alleged that he has been negligent about his party's work. He said that the party would become weak under some individuals leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X