హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో నిఫా వైరస్ లేదు: ఆ ఇద్దరి టెస్ట్ నెగిటివ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైర‌స్ లేదని, ప్రజ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి స్పష్టం చేశారు. విషజ్వరాలతో బాధ ప‌డుతున్న ఇద్దరికి కేవలం అనుమానంతో చేసిన ప‌రీక్షలు నెగెటివ్‌గా వచ్చాయని చెప్పారు.

వారి నమూనాలను పుణెలోని ఐసీఎంఆర్‌లో పరీక్షలు చేయించినట్లు చెప్పారు. ఒకరు ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు చికిత్సకు వెళ్ళగా ఫీవ‌ర్ ఆసుపత్రికి పంపించారని, నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించగా నిఫా వైరస్ లేనట్లు తేలిందని మంత్రి చెప్పారు. బాధితుడికి టైఫాయిడ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారని, ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్యం అందించి.. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారన్నారు.

Two Patients From Hyderabad Test Negative For Nipah Virus

తీవ్ర జ్వరంతో బాధ‌ప‌డుతూ మ‌రో వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని, అనుమానంతోనే నిఫా ప‌రీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సదరు బాధితుడు మెదడు సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్లుగా వైద్యులు గుర్తించారని, ఆయ‌న‌కు శస్త్ర చికిత్స చేయ‌డానికి నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.

ప్రజ‌లు ఎలాంటి అనుమానాలు, అపోహలకు ‌పోవ‌ద్దని మంత్రి తెలిపారు. అన్ని ర‌కాలుగా వైద్య శాఖ సిద్ధంగా ఉండటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు.

English summary
The two suspected cases of Nipah virus infection tested negative after their blood samples and throat swabs were examined in the National Institute of Virology or NIV, Pune, a senior government official said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X