• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హత్య తెలంగాణలో..! శవం ఏపీలో..! జయరామ్ కేసులో పోలీస్ క్రిమినల్ మైండ్స్?

|

హైదరాబాద్‌ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఆయన మేనకోడలు శిఖా చౌదరి టార్గెట్ గా సాగిన దర్యాప్తులో రాకేశ్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ప్రధాన నిందితుడిగా రాకేశ్ రెడ్డిని గుర్తించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో.. తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే రాకేశ్ రెడ్డి నేరచరిత్ర మొత్తం బయటపడింది. అదలావుంటే ఈ కేసులో తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు బయటకు రావడం సంచలనం రేకెత్తించింది.

రోజుకో నిజం..!

రోజుకో నిజం..!

జయరామ్ హత్య కేసులో రాకేశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసింది. ప్రధాన నిందితుడిగా రాకేశ్ ను విచారిస్తుండటంతో.. దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూస్తున్నాయి. జయరామ్ మర్డర్ కేసులో పోలీస్ అధికారుల పాత్ర తెరపైకి రావడం విస్మయం కలిగిస్తోంది. రాకేశ్ రెడ్డికి ఇద్దరు తెలంగాణ పోలీస్ అధికారులు అండగా నిలిచారనే ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్య చేసిన వెంటనే రాకేశ్ రెడ్డి.. ఆ ఇద్దరికి ఫోన్ చేసినట్లు విచారణలో బయటపడింది.

 ఖాకీల అండ..!

ఖాకీల అండ..!

రాకేశ్ రెడ్డికి సపోర్టుగా నిలిచిన పోలీస్ అధికారుల్లో ఒకరు నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ కాగా, నగర శివార్లలో ఏసీపీగా పనిచేస్తున్న మరొకరి పేరు బయటకొచ్చింది. జయరామ్ ను హత్య చేసిన తర్వాత ఆ ఇద్దరికి ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నాడు రాకేశ్ రెడ్డి. వారి సలహా మేరకే జయరామ్ మృతదేహాన్ని రాష్ట్రం దాటించినట్లు తెలుస్తోంది.

జయరామ్ హత్యకేసులో నిందితుడైన రాకేశ్ రెడ్డికి.. తెలంగాణ పోలీస్ అధికారులు అండగా నిలబడ్డారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నల్లకుంట సీఐ శ్రీనివాస్ పై సోమవారం నాడు బదిలీ వేటు వేశారు. రాకేశ్ రెడ్డి చెప్పిన వివరాలతో పాటు కాల్ డేటా చూసిన తర్వాతే శ్రీనివాస్ పేరుండటంతో చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వివాదంలో మరో ఏసీపీ పేరు కూడా తెరపైకి రావడంతో.. విచారణ చేస్తున్నారు ఉన్నతాధికారులు.

 పురోగతి సాధ్యమా?

పురోగతి సాధ్యమా?

జయరామ్ హత్య క్షణికావేశంలో జరిగినా.. ఆ తర్వాత రాకేశ్ రెడ్డి వేసిన స్కెచ్ చర్చానీయాంశంగా మారింది. హైదరాబాద్ లో హత్య చేసి ఏపీలో మృతదేహం పడేయాలనుకోవడం వెనుక పెద్ద హైడ్రామా నడిచినట్లు అర్థమవుతోంది. మర్డర్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ అధికారులకు ఫోన్ చేయడంతో.. మృతదేహం ఇక్కడినుంచి తరలించాలనే సలహా ఇచ్చారనేది రాకేశ్ రెడ్డి వెర్షన్. ఏపీ రాజకీయ నేతలతో అతడికి ఉన్న పరిచయాల నేపథ్యంలో.. ఈ కేసు నుంచి సులువుగా బయటపడొచ్చనే కారణంతోనే వారు సలహా ఇచ్చి ఉంటారా? అనే చర్చ జరుగుతోంది.

అదలావుంటే విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య సఖ్యత అంత బాగా లేదనే చెప్పొచ్చు. ఆ క్రమంలో ఇరు రాష్ట్రాల్లో నమోదైన పోలీస్ కేసులు నానుతున్నాయే తప్ప దర్యాప్తు ముందుకు సాగడం లేదనే వాదనలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జయరామ్ హత్య కేసులో పురోగతి సాధ్యమేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మొత్తానికి ఓ నిందితుడికి పోలీసులు సహకారం అందించారనే ప్రచారం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తున్న జయరామ్ కేసులో ఇంకెన్ని లీలలు బయటపడతాయోననే ఊహాగానాలు జోరందుకున్నాయి.

English summary
Twists and twists emerging in the famous industrialist Jayaram's murder. Detecting Rakesh Reddy as the chief suspect and initiating the investigation. The names of the two police officers of Telangana emerged in the case is going hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X