విషాదం: సూరత్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ ఉద్యోగులు మృతి
సూరత్/హైదరాబాద్: నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.
మృతి చెందినవారిలో అడిక్‌మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవాలయం జూనియర్ అసిస్టెంట్ రమణ ఉన్నారు. గాయాలపాలైనవారిలో సత్యనారాయణ, కేశవరెడ్డి, పూజారి వెంకటేశ్వర శర్మలను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Telangana : city busses will increase in hyderabad city | Oneindia Telugu
మృతుల కుటుంబాలకు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు.