హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అలా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన యువతులు పలు సాహస ప్రదర్శనల్లో పాల్గొని రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందారు. ప్రతిభకు అడ్డు లేదని నిరూపిస్తూ వారికి గోల్డెన్ ఛాన్స్ లభించింది. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ వారిద్దరినీ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 20 మందికి అవకాశమిస్తే.. తెలంగాణ నుంచి ఇద్దరు అడవి బిడ్డలకు ప్రాధాన్యం దక్కడం విశేషం.

సాహసాలతో మెరుస్తున్న అడవి బిడ్డలు

సాహసాలతో మెరుస్తున్న అడవి బిడ్డలు

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన యువతులకు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కొమురంభీం జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కన్నీబాయి.. కోలం కోటారి గ్రామానికి చెందిన కల్పన ఇంటర్‌ చదువుకున్నారు. వీరిద్దరికీ కూడా సాహసకృత్యాలంటే చాలా ఇష్టం. రన్నింగ్, స్విమ్మింగ్ తో పాటు కొండలెక్కడం లాంటి ఎన్నో సాహసకృత్యాల్లో ఆరితేరారు.

ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్

రాష్ట్రవ్యాప్త గుర్తింపు

రాష్ట్రవ్యాప్త గుర్తింపు

ఇదివరకు ఇచ్చోడ అటవీప్రాంతంలోని గాయత్రి గుండం అధిరోహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అదేవిధంగా హైదరాబాద్‌లో జరిగిన సైక్లింగ్‌, రన్నింగ్.. అరకులోయలో నిర్వహించిన వాటర్‌వాల్‌ రాఫ్లింగ్‌ పోటీల్లో సత్తాచాటారు. అలా అనేక క్రీడల ద్వారా రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందారు.

గోల్డెన్ ఛాన్స్

గోల్డెన్ ఛాన్స్

కన్నీబాయి, కల్పన ప్రతిభను గుర్తించిన అడ్వంచర్ క్లబ్ హైదరాబాద్ ప్రతినిధులు వారిని ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేయడం విశేషం. దేశవ్యాప్తంగా 20 మందిని సెలెక్ట్ చేస్తే అందులో ఆదిలాబాద్ గిరిజన యువతులు ఇద్దరు ఉండటంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరికి దాదాపు లక్షన్నర రూపాయల మేర ఖర్చు కానుండటంతో.. ఆ మొత్తం భరించడానికి ఐటీడీఏ ముందుకు రావడం హర్షణీయం. ఆ మేరకు ఇప్పటికే 90 లక్షల రూపాయల చొప్పున అందించారు ఐటీడీఏ పీఓ కృష్ణాదిత్య.

ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే అరుదైన అవకాశం రావడంతో కన్నీబాయి, కల్పన హ్యాపీగా ఫీలవుతున్నారు. వీరిద్దరికీ డెహ్రాడూన్ లో 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడనుంది. మొత్తానికి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సోమవారం నాడు ఢిల్లీకి బయలుదేరి వెళతున్నారు ఈ సాహస బాలికలు. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్.

English summary
Tribal women Madavi Kannibai and Madavi Kalpana From Adilabad are all set to begin their Everest journey. Hyderabad Adventure Club representatives selected these two women as their capabilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X