వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో కోచింగ్: సివిల్స్‌లో మెరిసిన కండక్టర్, ఆటో డ్రైవర్ల కొడుకులు

ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో వరంగల్‌ వాసికి 555వ ర్యాంకు వచ్చింది. నగరంలోని హంటర్‌రోడ్‌ నందిహిల్స్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ ఆర్‌టీసీ తొర్రూరు డిపో పరిధిలో కండక్టర్‌గా పనిచేస్తున్న బండారు నారాయణ-స్వరూప

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో వరంగల్‌ వాసికి 555వ ర్యాంకు వచ్చింది. నగరంలోని హంటర్‌రోడ్‌ నందిహిల్స్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ ఆర్‌టీసీ తొర్రూరు డిపో పరిధిలో కండక్టర్‌గా పనిచేస్తున్న బండారు నారాయణ-స్వరూప దంపతుల కుమారుడు రింజత్‌కుమార్‌ సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు.

రంజిత్‌ ఎస్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌, కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో 2008లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో సిస్టం ఇంజనీర్‌ (ఇంజినీర్‌)గా 2012 వరకు ఉద్యోగం చేశాడు. సవిల్‌ సర్వీసెస్‌పై మక్కువతో 2013లో మొట్టమొది సారిగా సవిల్స్‌ పరీక్ష రాశాడు. రాసిన మొది సారే ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. కానీ ఎంపిక కాలేదు. తర్వాత 2014, 2015లలో మళ్లీ రాసినా ఎంపిక కాలేదు. దీంతో మళ్లీ 2016లో రాశాడు.

తాజాగా 555 ర్యాంకు రావడంతో ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉందని రంజిత్‌ చెబతున్నాడు. కాగా రంజిత్‌ తండ్రి నారాయణ సొంత ఊరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగులోని వీవర్స్‌కాలనీ. ఈ సందర్భంగా రంజిత్‌ను పలకరించగా.. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే సివిల్స్‌ వైపు దృష్టి సారించానని తెలిపాడు. బీటెక్‌ పూర్తయిన వెంటనే ఆర్థికంగా నిలదొక్కుకరునేందుకు మూడు సంవత్సరాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశానని, ఆర్థికంగా వనరులు చేకూరిన తర్వాత సివిల్స్‌పై దృష్టిప్టోనని తెలిపాడు.

Two Warangal candidates cleared civils examination

ఆటోడ్రైవర్‌ కొడుక్కి 526వ ర్యాంకు

ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు చెన్నూరి రూపేశ్. సివిల్స్ లో 526వ ర్యాంకు సాధించాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించవద్దు అని సలహా ఇచ్చే రూపేశ్. ఎటువంటి కోచింగ్‌ లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం.

'చిన్నప్పటి పరిస్థితులు, పడ్డ కష్టాలే జీవితంలో ఏదో ఒక ఉన్నత స్థానంలో స్థిరపడాలనే ఆశయమే స్ఫూర్తిగా సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. మూడో ప్రయత్నంలో ఈ ఘనత సాధించాను. ఐఎఎస్‌ నా కల. ప్రస్తుత ర్యాంక్‌ ప్రకారం ఐపిఎస్‌ రావచ్చు. మరో సారి ఐఎఎస్‌ కోసం ప్రయత్నిస్తా. మాది వరంగల్‌ జిల్లా హసనపర్తి. నిరుపేద కుంటుంబం. తండ్రి రమణయ్య ఆటో డ్రైవర్‌, తల్లి సరోజన బీడీలు చూట్టేది. ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా చిన్నప్పటి నుంచే ట్యూషన్లు చెబుతూ చదువుకున్నాను' అని రూపేశ్ తెలిపాడు.

'2007లో హసనపర్తి జెడ్‌పిహెచసి నుంచి 10వ తరగతి, వరంగల్‌ పాలిటెక్నిక్‌ను ఎలక్ట్రికల్ డిప్లొమా, 2013లో కిట్స్‌ వరంగల్‌ నుంచి బీటెక్‌ (ఈఈఈ) పూర్తి చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంట్రల్‌ గవర్నమెంట్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్ సాగించాను. ఉదయం, రాత్రి వేళల్లో చదివే వాడిని. ఎగ్జామ్‌కు ముందు సెలవులు తీసుకునే వాడిని. ఛత్రీసింగ్‌ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 30 నిమిషాలు సాగింది. ముఖ్యంగా నేను జాబ్‌ చేస్తుండడంతో ఆ ప్రొఫైల్‌కు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. తర్వాత వరంగల్‌ జిల్లా కావడంతో నక్సలిజంపై కూడా ప్రశ్నించారు' అని చెప్పుకొచ్చారు.

English summary
Two Warangal district candidates cleared civils examination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X