హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి తెగువ: ‘ఫేస్‌బుక్’తో ఈవ్‌టీజర్ల అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమ్మాయిలను వేధిస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిని అల్లరి పెడుతున్న ఇద్దరు పోకిరీలు ఫేస్‌బుక్‌ ద్వారా బుక్‌ అయ్యారు. ట్రాఫిక్‌లో మహిళలను వేధిస్తున్న వారి ఫొటోలను ధైర్యం చేసి ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆమె ఎవరో కాదు టీవీ నటి అస్మిత కర్నానీ.

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ అమ్మాయిలను టీజ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలను ఫొటోలు తీసిన ఆమె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అంతేగాక, వారిని పాపులర్ చేయండని ఆమె వ్యాఖ్యానించారు.

దీంతో ఆ పోస్టింగ్‌లకు విపరీతమైన షేర్స్ వచ్చాయి. ఆ ఫొటోలు సొషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో షీ బృందం కూడా దీనిపై స్పందించింది. విచారణ చేపట్టిన ఆ పోకిరీలను అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులను నగరానికి చెందిన ఇమ్రాన్‌ బిన్‌ మహమ్మద్‌, సయ్యద్‌ నౌరుల్లాగా గుర్తించారు.

పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులకు నటి అస్మిత కర్నానీ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ’అమ్మాయిలను వేధించే వారిని చూసి భయపడకూడదు. మనం భయపడ్డాం అంటే రెచ్చిపోతారు. మౌనంగా భరిస్తే ఇంకా ముందుకు వస్తారు. అసభ్యకరంగా మాట్లాడటం.. సైగలు చేయడం వంటివి చేస్తారు. మనల్ని ఉద్దేశించి మాట్లాడేందుకు వారికెంత స్వేచ్ఛ ఉందో... వారిపై ఫిర్యాదు చేసేందుకు మనకంత హక్కు ఉంది' అని అన్నారు.

ఈవ్ టీజర్లు

ఈవ్ టీజర్లు

అమ్మాయిలను వేధిస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిని అల్లరి పెడుతున్న ఇద్దరు పోకిరీలు ఫేస్‌బుక్‌ ద్వారా బుక్‌ అయ్యారు.

ఈవ్ టీజర్లు

ఈవ్ టీజర్లు

ట్రాఫిక్‌లో మహిళలను వేధిస్తున్న వారి ఫొటోలను ధైర్యం చేసి ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆమె ఎవరో కాదు టీవీ నటి అస్మిత కర్నానీ.

ఈవ్ టీచర్లు

ఈవ్ టీచర్లు

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ అమ్మాయిలను టీజ్ చేస్తున్నారు.

ఈవ్ టీజర్లు

ఈవ్ టీజర్లు

ఆ దృశ్యాలను ఫొటోలు తీసిన ఆమె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అంతేగాక, వారిని పాపులర్ చేయండని ఆమె వ్యాఖ్యానించారు.

టీవీ నటి అస్మిత

టీవీ నటి అస్మిత

దీంతో ఆ పోస్టింగ్‌లకు విపరీతమైన షేర్స్ వచ్చాయి. ఆ ఫొటోలు సొషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో షీ బృందం కూడా దీనిపై స్పందించింది. విచారణ చేపట్టిన ఆ పోకిరీలను అరెస్ట్ చేసింది.

‘పోలీసులకు చెబితే మళ్లీ వారు పగబడతారు.. దాడి చేస్తారు అన్న అనుమానంతో వెనకాడితే మరింత మంది వేధింపుల పాలవుతారు. ఒకరి వ్యక్తిగత విషయాల్లో చొరబడే హక్కు ఇంకొకరికి లేదు. నేను కార్లో వెళ్తున్నప్పుడు వారు నన్ను చూసి ప్రవర్తించిన విధానం నచ్చలేదు. పదేపదే అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. అందుకే ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాను’ అని తెలిపారు.

’'షీ' బృందాలు స్పందించి వారిని అరెస్ట్‌ చేశాయి. పోకిరీలు, ఈవ్‌టీజర్ల వ్యాఖ్యలను భరిస్తున్న వారు ఇప్పటికైనా ముందుకు రావాలని కోరుతున్నాను' అని టీవీ నటి ఆస్మిత కర్నానీ తెలిపారు.

English summary
Two youth arrested for teasing girls in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X