వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రోలో బయటపడ్డ ‘లొసుగు’: ఛార్జీలు పడకుండానే ప్రయాణం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Metro Rail : Youth Escaped From Charges, Know How ? | Oneindia Telugu

హైదరాబాద్: మెట్రో రైలు తొలి రోజే 2లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తొలి రోజు కావడంతో ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపారు. మెట్రో అధికారులు కూడా ప్రయాణికుల అంచనాకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు.

మెట్రో తొలిరోజే రికార్డ్: ప్రయాణికులతో కిటకిట, సెల్ఫీల హోరు(పిక్చర్స్)మెట్రో తొలిరోజే రికార్డ్: ప్రయాణికులతో కిటకిట, సెల్ఫీల హోరు(పిక్చర్స్)

అంతేగాక, ఎంతో అత్యాధునిక, కట్టుదిట్టమైన పరిజ్ఞానంతో మెట్రో వ్యవస్థను అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా మెట్రో వ్యవస్థలోని ఓ లోపం బయటపడింది. దాని ఆసరాగా చేసుకుని ఇద్దరు యువకులు ఛార్జీల పడకుండా ప్రయాణం చేయడం గమనార్హం.

మెట్రో రైలుకు గిరాకీ: రెండు రోజుల్లోనే వేల స్మార్ట్ కార్డులుమెట్రో రైలుకు గిరాకీ: రెండు రోజుల్లోనే వేల స్మార్ట్ కార్డులు

 రూ.10 జరిమానా

రూ.10 జరిమానా

ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇద్దరు యువకులు బుధవారం మెట్రోలో అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు బయలు దేరారు. స్మార్ట్‌ కార్డు కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్‌ గేటు వద్ద స్వైప్‌ చేసి మెట్రో ఎక్కి.. మియాపూర్‌ వెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫాం మీద కాసేపు గడిపి తిరిగి మెట్రోలో అమీర్‌పేట చేరుకున్నారు. మెషిన్‌ వద్దకు వచ్చి స్మార్ట్‌ కార్డు స్వైప్‌ చేయగానే పది రూపాయల జరిమానా పడినట్టు చూపించింది.

 ఎందుకిలా జరిగిందంటే.?

ఎందుకిలా జరిగిందంటే.?

ఎందుకిలా జరిగిందని స్నేహితులు ఆరా తీయగా ప్లాట్‌ఫాంలో అరగంట అంతకు మించి ఉంటే ఛలానా పడుతోందనే విషయం తెలిసింది. అయితే, ఇక్కడ వారిద్దరూ మియాపూర్‌ వరకు వెళ్లి వచ్చినందుకు అయ్యే ఛార్జీ మాత్రం పడలేదు. ఇదేదో తమకు లాభం చేకూర్చేదిలా ఉందనుకుంటూ.. ఇద్దరు ఎస్కలేటర్‌ మీదుగా కిందకు చేరుకున్నారు. వీరిద్దరే కాదు, మరికొందరికి కూడా ఈ విషయం తెలిసింది.

 ఛార్జీలు పడకుండానే ప్రయాణం

ఛార్జీలు పడకుండానే ప్రయాణం

మెట్రోలో ప్రయాణించే వారు గమ్యస్థానానికి చేరుకున్నాక ఎగ్జిట్‌ వద్ద కార్డు స్వైప్‌ చేయగానే స్మార్ట్‌ కార్డులో అప్పటి వరకు అయిన చార్జీ బ్యాలెన్స్‌లో కట్‌ అవుతోంది. ఎగ్జిట్‌ వద్ద స్వైప్‌ చేయకుండా తిరిగి బయలు దేరిన స్టేషన్‌కు వెళ్తే స్మార్ట్‌ కార్డులో ఛార్జీ చూపించడం లేదు. దీంతో ఇదేదో బాగుంది వీరితోపాటు పలువురు స్మార్ట్‌ కార్డులు కొనుగోలు చేసి ఛార్జీలు పడకుండానే ప్రయాణం చేస్తుండటం గమనార్హం.

 ఇదీ అసలు లొసుగు

ఇదీ అసలు లొసుగు

అంతేగాక, మెట్రోలో చక్కర్లు కొట్టిన వీరి ప్రయాణించే సమయాన్ని స్టేషన్‌లోనే గడిపినట్టు చూపిస్తుండడంతో వంద రూపాయల ఛార్జీ స్థానంలో కేవలం పది రూపాయల జరిమానా మాత్రమే పడుతోంది. దీంతో పలువురు తమకు నచ్చినచోటుకు వెళ్తూ ఛార్జీలు చెల్లించకుండానే మెట్రోలో షికారు చేస్తున్నారు. అయితే, కొంత మంది ఈ విషయాన్నిమెట్రో నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై దృష్టి సారించారు మెట్రో అధికారులు.

English summary
Two youth escaped from Charges in Hyderabad Metro Rail traveling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X