వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 ఏళ్లుగా అక్రమ నివాసం, రూ.కోటి ఫైన్.. మాఫీ చేయడంతో స్వదేశానికి కూలీ..

|
Google Oneindia TeluguNews

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ప్ వెళ్లిన ఒకతనికి ఆ దేశం జీవితంలో మరచిపోలేని సాయం చేసింది. 13 ఏళ్లు అక్రమంగా తమ దేశంలో ఉన్న మన్నించి వదిలివేసింది. దీంతో అతను రెక్కలు కట్టుకొని స్వదేశంలో వాలిపోయారు. తనను స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి కోసం గల్ఫ్..

ఉపాధి కోసం గల్ఫ్..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోతుగొండ మేడీ ఉపాధి కోసం గల్ప్ వెళ్లాడు. అతనికి ఏజెంట్ మాయమాటలు చెప్పాడు. కానీ అక్కడికీ వెళ్లాక మాత్రం.. సరైన పత్రాలు లేవు. 2007లో యూఏఈలో అడుగుపెట్టి.. అక్కడే ఉన్నాడు. అయితే కూలీ, నాలీ చేసుకొని జీవించేవాడు. కానీ కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది.అందులో మేడి కూడా బయటకొచ్చారు. ఎందుకంటే ఉపాధి లేకపోవడంతో ఆయనకు అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనా నేపథ్యంలో బయటకు..

కరోనా నేపథ్యంలో బయటకు..

కరోనా విజృంభించడంతో మేడికి పూట గడవటం కష్టంగా మారింది. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించాడు. సమస్యను వివరించి, సాయం చేయాలని కోరాడు. దీంతో కాన్సులేట్ అధికారులు యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మొదట్లో నో అన్న తర్వాత సానుకూలంగా స్పందించారు. అతనిని స్వదేశం పంపించే ఏర్పాట్లు చేశారు.

రూ.కోటి ఫైన్..

రూ.కోటి ఫైన్..

అయితే 13 ఏళ్ల తమ దేశంలో అక్రమంగా నివసించడంపై భారీగా జరిమానా వేశారు. రూ.కోటి వరకు ఫైన్ కట్టాలని స్పష్టంచేశారు. కానీ అతని వద్ద చిల్లిగవ్వ లేదు. దీంతో కాన్సులేట్ అధికారులు సంప్రదింపులు జరిపారు. అతని పరిస్థితిని చూసి జరిమానా కూడా మాఫీ చేశారు. దీంతో మేడీ.. స్వదేశానికి రెక్కలు కట్టుకొని వాలిపోయారు. తాను స్వదేశం వచ్చేందుకు సాయం చేసిన కాన్సులేట్ అధికారులకు మేడి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
UAE government help to telangana labour potugonda medi. 13 years after he came to country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X