వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌భవన్‌లో ఉగాది సందడి : ఆటపాటలతో హోరెత్తించిన కళాకారులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు రాజ్‌భవన్‌లో ఒకరోజు ముందే నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు గవర్నర్. ఆ తర్వాత నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ugadi celebrations at rajbhavan

ఆట పాట
తొలుత ప్రముఖ నేపథ్యగాయని మాళవిక గానమృతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత వైష్ణవి, విఘ్నేశ్ బృందం డ్యాన్సులతో అలరించారు. ప్రీ ఉగాది వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన గుస్సాడి నృత్యం ఆకట్టుకొంది.

పంచాగ శ్రవణం, గవర్న్ విషెస్
వికారినామ ఉగాది సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు శ్రీ విద్య శ్రీధర శర్మ పంచాగ శ్రవణం చేసి తెలిపారు. ఈ ఉగాది ప్రజల శాంతి, సౌభ్రాతుత్వంతో మెలగాలని, వారికి సంతోషం కలిగించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఆ తర్వాత వివిధ కళారూపాలు ప్రదర్శించిన కళాకారులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తాత్కాలిక సీజేఐ రాఘవేంద్ర చౌహన్, ఏపీ తాత్కాలిక సీజే ప్రవీణ్ కుమార్, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Ugadi celebrations were held one day before in Raj Bhavan. On Friday evening, Governor Narasimhan was the chief guest of the event. The initiative of the Jyoti was formally launched by the Governor. Various cultural programs that followed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X