వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి నేతల కుట్ర ఉండొచ్చు: సందీప్, మీడియాకే ఉమామాధవ రెడ్డి షాక్

|
Google Oneindia TeluguNews

భువనగిరి: నయీం కేసులో లీకులు ఇచ్చి తమ కుటుంబానని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత ఉమా మాధవ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు బయటకు రావాలంటే జ్యూడిషియల్ విచారణ వేయాలన్నారు.

నయీంను చూల్లేదు, కేసీఆర్‌నే ప్రశ్నిస్తున్నా, చూసుకుందాం: ఉమామాధవ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భూదందాలు మొదలయ్యాయని చెప్పారు. 2004 వరకు భూదందాల వంటి సంఘటనలు జరగలేదన్నారు. అలాంటప్పుడు తమ పైన ఎలాంటి ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. దీనిని చూస్తుంటే మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం కనిపిస్తోందన్నారు.

దీనిపై సీబీఐ లేదా జ్యూడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందరి విషయాలు బయటపడాలంటే విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. కొందరిని కాపాడేందుకు తమ పైన కుట్ర చేస్తున్నారన్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

నయీం కేసులో పెద్ద వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ పైన కుట్రలో కొందరు టిడిపి నేతలు ఉన్నారనే అనుమానాలను సందీప్ రెడ్డి వ్యక్తం చేశారు. కాగా, సందీప్ రెడ్డి వ్యాఖ్యల పైన చర్చ సాగుతోంది. ప్రభుత్వంతో పాటు కొందరు టిడిపి నేతలు అనడం గమనార్హం. మరో సందర్భంలో సందీప్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేరును ప్రస్తావించారు.

Uma Madhava Reddy and her son drags government

విలేకరులకు ఉమా మాధవ రెడ్డి ఎదురు ప్రశ్న

కొడుకు కంటే ముందు ఉమా మాధవ రెడ్డి సూటిగా మాట్లాడారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆమె మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు ఆమె ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ కేసులో మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే.. అసలు విలేకరులు తనకు ఎందుకు ఫోన్ చేశారో చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నించారు.

మాజీ మంత్రి అని వార్తలు రాగానే తనకు చాలామంది రిపోర్టర్లు ఫోన్లు చేశారని, వారి పేర్లు కూడా చెప్పమంటే చెబుతానన్నారు. అలాగే పత్రికలోను వచ్చాయని చెప్పారు. కాబట్టి తాను బయటకు వచ్చానన్నారు. భువనగిరి మాజీ మంత్రి అంటే తానే ఉన్నానని చెప్పారు.

వ్యాస్ హత్య నుంచే మాజీ డీజీపీతో లింక్, నయీం బెడ్రూంలో.. (పిక్చర్స్)వ్యాస్ హత్య నుంచే మాజీ డీజీపీతో లింక్, నయీం బెడ్రూంలో.. (పిక్చర్స్)

ఆమె చిద్విలాసంగానే ప్రసంగం మొదలు పెట్టారు. ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా విరుచుకుపడ్డారు. తానేమీ మీడియా ముందుకు రావాలనుకోలేదని చెప్పారు. మీడియానే తన వివరణ కోరితేనే తాను మీడియా సమావేశం పెట్టానని చెప్పారు.

నయీం వ్యవహారంలో తన పేరు తీసుకొచ్చింది మీడియానే అన్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ప్రతినిధులకు నోట మాట రాకుండా చేశారు. స్థానిక మీడియా తన పేరు పెట్టకుండా పరోక్షంగా కథనాలు రాస్తే.. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు తన పేరుతోనే కథనాలు రాశాయన్నారు. ప్రభుత్వమైనా, పోలీసులైనా ఈ కేసులో తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు.

ఓ టీవీ ఛానల్‌తో ఉమా మాధవ రెడ్డి

ఉమా మాధవ రెడ్డి ఓ టీవీ ఛానల్‌తోను మాట్లాడారు. 'లేని సంబంధాల్ని అంటగట్టడం సమంజసం కాదు. నాకు అవసరం లేని విషయాలు కావాలని మీరు అంటగడుతున్నారు. ఏవిధంగా అంటగడుతున్నారో ఆధారాలు చూపించండి. ఎన్టీవీ వాల్లే తన పైన ఆరోపణలు మొదలు పెట్టారు. దానికి ఆధారాలు చూపించండి.

నయీం వెనుక తాను ఉన్నట్లు మీరు చెప్పారు. కాబట్టి ఆ లింకులు మీరే బయట పెట్టాలి. నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను. గొడవలు, కొట్లాటలు తెలియని కుటుంబం నుంచి వచ్చాను. మాధవ రెడ్డి గారి గురించి అందరికీ తెలియదా. ఆయన మృతి అనంతరం ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.

అసలు నాకు ఎమ్మెల్యే కావాలని కూడా లేదు. ప్రజలు కోరుకుంటే వచ్చాను. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నా పేరు చెప్పారు కాబట్టి వచ్చి మాట్లాడాను. లేదంటే నేను వచ్చి మాట్లాడకపోయేదానిని. ఓ మహిళను బయటకు లాగడంపై ప్రభుత్వం, డిపార్టుమెంటు సమాధానం చెప్పాలి.

తాను తెరాసలో చేరాలని ఎప్పుడు అనుకోలేదన్నారు. కావాలంటే అప్పుడే చేరదానిని అన్నారు. ప్రజలు ఒప్పుకుంటే రాజకీయాల్లో ఉంటానని, లేదంటే ఇంటి వద్ద కూర్చుంటానని చెప్పారు. టిడిపిని దెబ్బ తీసేందుకే ఈ కుట్ర జరగవచ్చునని చెప్పారు. సిట్ పైన తనకు నమ్మకం లేదన్నారు.' అన్నారు.

English summary
Uma Madhava Reddy and her son drags government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X