వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మినరల్ వాటర్ ప్లాంట్స్ పేరుతో చెలగాటం: వెలుగు చూసిన నిజాలు

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: పట్టణంలోని వివిధ ప్రదేశాలలో గల అనుమతి లేని,సరైన ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు,రెవిన్యూ, ఫుడ్ ఇన్స్పెక్టర్ తో యుక్తముగా 5 ప్లాంట్స్ పై దాడులు చేసి,3 సీజ్ చేయడం జరిగింది.

Unauthorized mineral plants raided

కరీంనగర్ పట్టణంలో వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్స్ అనుమతి లేకుండా,సరియైనటువంటి ప్రమాణాలు పాటించకుండా,కెమికల్స్ వాడుతూ శుద్ధత లేకుండా,మినరల్ వాటర్ పేరుతో అమ్ముతూ,అధిక మొత్తం లో డబ్బులు లాగుతున్నారని టాస్క్ ఫోర్స్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Unauthorized mineral plants raided

ఈనేపథ్యంలో, రెవెన్యూ, ఫుడ్ ఇన్స్పెక్టర్ తో యుక్తముగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్దపల్లి బైపాస్ లో గల గోజికర్ శివ కుమార్ కు చెందిన కిన్నెర వాటర్ ప్లాంట్,హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని రాజేంద్రప్రసాద్ కి చెందిన శ్రీరామ వాటర్ ప్లాంట్,టవర్ సర్కిల్ లోని అంతగిరి రాజుకు చెందిన రక్ష వాటర్ ప్లాంట్,అక్కడే గల షేక్ సయ్యద్ కు చెందిన రాయల్ వాటర్ ప్లాంట్, షాశా మహల్ లోని షియజుద్దీన్ కు చెందిన మానేరు మినరల్ వాటర్ ప్లాంట్స్ పై ఏక కాలంలో మూకుమ్మడిగా సంయుక్త దాడులు నిర్వహించారు.

Unauthorized mineral plants raided

సరైన ప్రమాణాలు పాటించకుండ ప్యాకేట్స్ లలో వాటర్ ను ప్యాక్ చేసి సప్లై చేస్తున్న కిన్నెర,శ్రీరామ,రక్ష వాటర్ ప్లాంట్స్ ని సీజ్ చేయడం చేశారు. అలాగే ప్యాకింగ్ లేనటువంటి రాయల్,మానేరు వాటర్ ప్లాంట్స్ యజమానులకు తగు సూచనలు చేస్తూ,హెచ్చరికలు జారిచేయడం జరిగింది.అలాగే ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే వారి ను వాడాలని లేకుంటే వ్యాదుల పాలు కావాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

English summary
Taskforce police found unauthorised mineral plants in Karimnagar of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X