వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ క్యాబినెట్ లో అనూహ్య మార్పులు..! నగరానికి చెందిన ఆ ఇద్దరు మంత్రులు ఔట్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మండలిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ పార్టీ రెండో సారి అదికారం చేపట్టున తర్వాత ఇద్దరు కీలక నేతలకు సీఎం చంద్రశేఖర్ రావు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. ఇప్పుడు మంత్రి వర్గాన్ని పునరుద్దరించాలని చంద్రశేఖర్చ రావు భావిస్తున్న తరణంలో తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు తమ పదవులను త్యాగం చేయాల్సి ఉంటుందనే సంకేతాలను కూడా పంపిపట్టు తెలుస్తోంది.

 మంత్రి వర్గం నుండి త‌ల‌సాని, మ‌ల్లారెడ్డి ఔట్‌...! కేటీఆర్, హ‌రీశ్‌రావు ఇన్‌..!!

మంత్రి వర్గం నుండి త‌ల‌సాని, మ‌ల్లారెడ్డి ఔట్‌...! కేటీఆర్, హ‌రీశ్‌రావు ఇన్‌..!!

తెలంగాణ‌లో పది హేడు ఎంపీ సీట్లకు గాను ఎంఐఎం సీటును మిన‌హాయిస్తే మిగిలిన ప‌దహారు సీట్ల‌ను గెల‌వాల‌ని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు భావించారు. అంతే కాదు చంద్రశేఖర్ రావు తో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్త్ర‌త ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.. కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.. దీంతో ఎంపి స్థానాల‌న్నీ త‌మ ఖాతాలోకి వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ భావించింది.

నగరంలో లోక్ సభ స్థానాల ఓటమి.. ఆగ్రహంతో ఉన్న బాస్..

నగరంలో లోక్ సభ స్థానాల ఓటమి.. ఆగ్రహంతో ఉన్న బాస్..

అయితే అనుహ్యాంగా కేవ‌లం తొమ్మిది స్థానాల‌కే గులాబీ పార్టీ ప‌రిమిత‌మైంది.తెలంగాణ మంత్రుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.. త‌మ ప‌ద‌వుల‌కు ఎప్పుడు ఎర్త్ ప‌డుతుందోన‌న్న భ‌యం వారిని వెంటాడుతోంది. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ప‌రిధిలోని మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మంటున్నారు. వీరి బ‌దులుగా...టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత‌లు కేటీఆర్‌, హ‌రీశ్‌రావుకు కేబినెట్లో బెర్త్ కాయ‌మన్నట్టు తెలుస్తోంది.

 మంత్రుల అసమర్థత..! సొంత మనుషులనే గెలిపించుకోలేక పోయారని ఆరోపణలు..!!

మంత్రుల అసమర్థత..! సొంత మనుషులనే గెలిపించుకోలేక పోయారని ఆరోపణలు..!!

గ్రేట‌ర్ కు సంబంధించి మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయికిర‌ణ్ కు సికింద్రాబాద్ ఎంపి సీటును టీఆర్ఎస్ కేటాయించింది.. సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి.. అయినా కూడ ఇక్క‌డ కిష‌న్ రెడ్డి గెల‌వ‌డంతో సీఎం న‌గ‌ర నేత‌ల‌పై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.. దీంతో మంత్రి త‌ల‌సానిలో ఆందోళ‌న మొద‌లైన‌ట్లు అయ‌న సన్నిహితులు చెబుతున్నారు. గ్రేట‌ర్ కు సంబంధించి మ‌రో మంత్రి అయిన మ‌ల్లారెడ్డిలో ఇదే ర‌కం భ‌యం క‌నిపిస్తోంద‌ని చర్చ జరుగుతోంది. మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంపిగా పోటీ చేశారు. అయితే, ఆయ‌న ఓట‌మి పాల‌వ‌గా...ఇక్క‌డి నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు.

 క్యాబినెట్ లోకి హరీష్ కేటీఆర్ పునరాగమనం..! బలోపేతం కానున్న టీఆర్ఎస్..!!

క్యాబినెట్ లోకి హరీష్ కేటీఆర్ పునరాగమనం..! బలోపేతం కానున్న టీఆర్ఎస్..!!

త‌మ కుటుంబానికే చెందిన నేత‌ల‌ను గెలిపించుకోలేక‌పోవ‌డంతో త‌మ మంత్రి ప‌ద‌వులు ఊడిన‌ట్లేనని ఈ అమాత్యులు భావిస్తున్నార‌ని అంటున్నారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను, మేన‌ల్లుడు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావును కేబినెట్లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రు మంత్రుల‌ను తొల‌గించి ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను పార్టీలోకి తీసుకుంటార‌ని, రాబోయే వారంలో జ‌ర‌గ‌బోయే విస్త‌ర‌ణలో ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాలు సైతం దీన్ని తోసిపుచ్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

English summary
Telangana cm Chandrasekhar Rao seems to feel that his son Ktr and son in-law Harish Rao are to be taken into account by the minister to revive the ministerial category. In this context, the two ministers of the city have also been sending signs that they will have to sacrifice their jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X