కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో అనూహ్య ట్విస్ట్... బయటపెట్టిన పోలీసులు...
కామారెడ్డి పట్టణంలో వివాహిత గొంతు కోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు కోసి పరారైనట్లుగా మొదట ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. ఆమెపై ఎవరూ దాడి చేయలేదని... తనకు తానే గొంతు కోసుకుందని పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి పట్టణంలోని బర్కత్‌పురా కాలనీలో మంగళవారం(ఆగస్టు 31) ఉదయం ఓ వివాహిత ఇంటి వాకిలి శుభ్రం చేస్తుండగా ఆమెపై దాడి జరిగినట్లు ప్రచారం జరిగింది. గుర్తు తెలియని దండుగులు బైక్‌పై వచ్చి ఆమె గొంతు కోసి పరారైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత వద్దకు వెళ్లి మాట్లాడారు.

ప్రాథమిక దర్యాప్తులో వివాహితపై దాడి జరగలేదని పోలీసులు నిర్దారించారు. ఆమె తనకు తానే గొంతు కోసుకుందని చెప్పారు. బహుశా ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం కామారెడ్డికి చెందిన యువకుడితో ఆమె పెళ్లి జరిగిందన్నారు. అయితే గతంలో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉండటంతో.. రెండు నెలల క్రితం కూడా ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పహాడీషరీఫ్‌లో
నెల
రోజుల్లో
4
హత్యలు
:
హైదరాబాద్
పహాడీ
షరీఫ్
పోలీస్
స్టేషన్
పరిధిలో
38
రోజుల
వ్యవధిలో
నాలుగు
హత్యలు
చోటు
చేసుకోవడం
తీవ్ర
కలకలం
రేపుతోంది.
తాజాగా
రంగనాయకుల
దేవాలయంలో
కౌశిక్
శోభా
శర్మ(76)
అనే
మహిళ
మృతి
చెందారు.
ఈ
ఆలయంలో
ఆమెతో
పాటు
ఆమె
కుమారుడు
మనోజ్
శర్మ
పూజారులుగా
ఉన్నారు.
అయితే
కుటుంబమంతా
వేరే
చోట
ఉంటుండగా
శోభా
శర్మ
ఆలయంలోనే
ఉంటున్నారు.
ఈ
క్రమంలో
ఈ
నెల
28న
మనోజ్
శర్మ
తల్లి
శోభా
శర్మకు
ఫోన్
చేయగా
ఆమె
నుంచి
స్పందన
రాలేదు.
దీంతో
స్థానికుడైన
ఓ
యువకుడికి
చెప్పి
చూసి
రమ్మన్నాడు.
అతను ఆలయం వద్దకు వెళ్లి చూడగా... అప్పటికే ఆమె మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించారు. శోభా శర్మ మెడకు ఉరి బిగించి ఉండటాన్ని గమనించారు. ముఖంపై రక్తపు గాయాలు కూడా ఉన్నాయి. లోపలి గదిలో అల్మారా తలుపులు పగలగొట్టినట్లు గుర్తించారు.ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసినవారే దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మనోజ్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.