వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడిరోడ్డుపై పట్టపగలే పెట్రోల్ తో యువకుడు ఇలా...చివరికిలా..ఎందుకంటే

సికింద్రాబాద్ సమీపంలోని బిషప్ కార్యాలయం మూలమలుపు వద్ద గుర్తు తెలియని యువకుడు నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొన్నాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన

By Narsimha
|
Google Oneindia TeluguNews

నగరంలో ఓ వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఈ మంటలకు తాళలేక ఆయన బిషప్ కార్యాలయంలోనికి వెళ్ళాడు.

అక్కడ పనిచేసే వాచ్ మెన్ మంటలను ఆర్పాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన మరణించాడు.ఈ ఘటన సికింద్రాబాద్ లో సంచలనం సృష్టించింది.

సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ వద్ద ఓ వ్యక్తి ఆటో దిగాడు. అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ లో తన వెంట తెచ్చుకొన్న బాటిల్ లో పెట్రోల్ నింపుకొన్నాడు.

sucide

పెట్రోల్ బాటిల్ ను తీసుకొని సరోజినిదేవి రోడ్డు వైపు వెళ్ళాడు. అక్కడే ఉన్న బిషప్ కార్యాలయం మూలమలుపు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు.

ఈ మంటలు తట్టుకోలేక అతను బిషప్ కార్యాలయంలోని గేటు తీసుకొని వెళ్ళాడు.అయితే అక్కడ విధులు నిర్వహిస్తోన్న వాచ్ మెన్ రాంబాబు మంటలు ఆర్పేందుకు యత్నించాడు.

అంతేకాదు వెంటనే 108 సమాచారం ఇచ్చాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.అయితే బాధితుడు అప్పటికే 80 శాతం కాలిపోయిందని వైద్యులు గుర్తించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా గుర్తించలేదు.మృతుడి మెడలో ఏసుక్రీస్తు ఫోటోతో ఉన్నలాకెట్ ఉంది. మృతుడు క్రిస్టియన్ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మృతుడి వద్ద బ్యాగు ఉంది.అయితే ఆ బ్యాగులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

మృతుడు ఎవరు, ఎందుకు నడిరోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై పోలీసులకు అంతుపట్టడం లేదు .అక్కడ ఉన్న సిసి కెమెరాల పుటేజీ ఆధారంగా

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నీలంరంగు చొక్కా, నలుపురంగు ఫ్యాంట్ వేసుకొన్నాడు.ఈ ఆధారాలు మినహ ఇతర ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు.

English summary
unidentified young man committed suicide in secunderabad on saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X