హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీణా-వాణీలతో దత్తన్న: ఆపరేషన్‌కు ఆస్ట్రేలియా వైద్యుల సుముఖత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేస్తామని తాజాగా ఆస్ట్రేలియా వైద్య నిపుణులు తమను సంప్రదించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పిల్లలను వైద్యులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

శనివారం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కలరా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. నిలోఫర్‌ చిన్నపిల్లల ఆస్పత్రి అని, వీణా-వాణిలు పెద్దవారవుతుండడంతో వారిక్కడ ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో స్టేట్‌హోంకు తరలించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిలోఫర్‌లో మాదిరిగానే స్టేట్‌హోంలోనూ అన్ని వసతులు కల్పిస్తామన్నారు.

'అవిభక్త కవలలైన వీణా వాణీలకు ప్రత్యేక చికిత్సలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదివరకే లండన్‌ నుంచి వచ్చిన వైద్య ప్రముఖులు, ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు పరిశీలించారు. శస్త్రచికిత్సకు ముందుకొచ్చినా ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. వారు పిల్లల్ని పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటాం' అని మంత్రి తెలిపారు.

తొలుత వీణావాణిలను తల్లిదండ్రులకు అప్పగించాలని భావించినా పేదరికం కారణంగా వారిని పెంచలేమన్నారని తెలిపారు. ప్రభుత్వం సహకారం అందించాలని కోరారనీ, దీంతో పిల్లలను ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఇది ఇలా ఉండగా, నగరంలో కలరా వ్యాధి లేదని మంత్రి స్పష్టం చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పపత్రిలో శుక్లాలు శస్త్రచికిత్స చేయించుకున్న 13 మందికీ చూపు పోలేదన్నారు. ఇందులో ఆరుగురికి శస్త్రచికిత్స పూర్తయి ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు.

మిగిలినవారిలో ఇద్దరికి శస్త్రచికిత్స చేసి కార్నియా మార్చామని చెప్పారు. మిగితా వారిని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి చెందిన నిపుణులు వచ్చి పరిశీలించారని, చికిత్సలు సరిగానే అందుతున్నాయని లక్ష్మారెడ్డి వెల్లడించారు.

మేము నిలోఫర్‌లోనే ఉంటాం తాతా: కేంద్రమంత్రి దత్తన్నతో వీణావాణీ

'తాతా.. మేము నిలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటాం.. ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. ఇదే మా కోరిక' అని అవిభక్త కవలలు వీణావాణీ కేంద్రమంత్రి దత్తాత్రేయతో అన్నారు. శనివారం దత్తాత్రేయ ఈఎస్‌ఐ మెడికల్ ఆస్పత్రి డీన్ శ్రీనివాస్‌తో కలిసి వీణావాణిల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వీణావాణిలతో మాట్లాడారు.

తాను వెళ్లే సమయానికి ఇద్దరు చెస్ ఆడుతూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించారని మంత్రి చెప్పారు. పిల్లలిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. వీరిని ఆపరేషన్ చేసి విడదీసే విషయంలో వైద్యుల సలహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని, విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో కేంద్రం నుంచి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు వివరించారు.

ఇలాంటి తరహా కేసుల్లో చాలామంది ఆరోగ్యంగా పెళ్లి చేసుకొని, ఉద్యోగాలు చేస్తున్న వారున్నారని మంత్రి ఉదహరించారు. వీరికి స్టెఫండ్ అందించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. 'మీరెప్పుడైనా కొట్లాడుకుంటారా?' అని మంత్రి అడిగితే.. 'లేదు సార్ మేము ఎప్పుడు కొట్లాడుకోము.. మంచిగా కలిసి ఆడుకుంటాం' అని వారు సమాధానమిచ్చారు.

మొక్క నాటిన దత్తాత్రేయ

మొక్క నాటిన దత్తాత్రేయ

కేంద్రమంత్రి దత్తాత్రేయ శనివారం నిలోఫర్‌లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

వీణా-వాణీలతో దత్తాత్రేయ

వీణా-వాణీలతో దత్తాత్రేయ

‘తాతా.. మేము నిలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటాం.. ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. ఇదే మా కోరిక' అని అవిభక్త కవలలు వీణావాణీ కేంద్రమంత్రి దత్తాత్రేయతో అన్నారు. శనివారం దత్తాత్రేయ ఈఎస్‌ఐ మెడికల్ ఆస్పత్రి డీన్ శ్రీనివాస్‌తో కలిసి వీణావాణిల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వీణావాణిలతో మాట్లాడారు.

దత్తాత్రేయ

దత్తాత్రేయ

తాను వెళ్లే సమయానికి ఇద్దరు చెస్ ఆడుతూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించారని మంత్రి చెప్పారు.

వీణా-వాణీలతో దత్తాత్రేయ

వీణా-వాణీలతో దత్తాత్రేయ

పిల్లలిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. వీరిని ఆపరేషన్ చేసి విడదీసే విషయంలో వైద్యుల సలహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని, విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో కేంద్రం నుంచి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు వివరించారు.

English summary
Union Minister Bandaru Dattatreya on Saturday promised help to conjoined twins, Veena and Vani, who have been living in a state-run hospital in Hyderabad for the last 12 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X