వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రోరైలు: పిల్లర్లతో అడ్రస్, జీపీఎస్, గూగుల్‌ మ్యాప్‌తో లింక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలులో ప్రయాణంతో క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు మరో సౌలభ్యం కూడ ఉంది. మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన నెంబర్ల ఆధారంగా సులభంగా అడ్రస్‌ను కనుక్కొనే వెసులుబాటు దక్కనుంది.

హైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివేహైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివే

Recommended Video

Hyderabad Metro Rail : Metro smart cards

హైద్రాబాద్ మెట్రో‌రైలు ప్రాజెక్టును ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ నవంబర్ 28వ, తేది మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభించనున్నారు. మెట్రో రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్

హైద్రాబాద్ మెట్రో రైలు సేవలు నవంబర్ 28వ, తేది నుండి అందుబాటులోకి రానున్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే మెట్రో ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన సూచనలను పాటించాల్సిందే.మెట్రో ఇచ్చిన సూచనలను పాటించకపోతే జైలు శిక్ష తప్పదు.

 మెట్రో పిల్లర్ల సహయంతో అడ్రస్

మెట్రో పిల్లర్ల సహయంతో అడ్రస్

హైద్రాబాద్ మెట్రో రైలు ద్వారా క్షణాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకొనే సౌకర్యంతో పాటు అడ్రస్ తెలుసుకొనే అవకాశం కూడ దక్కింది. మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో అడ్రస్ కోసం కుస్తీ పడాల్సిన పనిలేదు. ఫలానా చిరునామా కోసం ప్రతి ఒక్కరిని కూడ అడగాల్సిన పని కూడ లేదు. మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన నెంబర్ల ఆధారంగా అడ్రస్‌ను కనుక్కోవచ్చు.

మెట్రొ పిల్లర్లకు యూనిక్ నెంబర్లు

మెట్రొ పిల్లర్లకు యూనిక్ నెంబర్లు

మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్లను గూగుల్ మ్యాప్‌తో పాటు జిపిఎస్‌తో అనుసంధానం చేశారు. దీని ద్వారా సులభంగా మెట్రోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులు సులభంగా తాము ప్రయాణం చేస్తున్న ప్రాంతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు దక్కనుంది ఇంటర్నెట్ సహయంతో తాము ఏ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నామో తెలుసుకోవచ్చు. లేదా టీ సవారీ యాప్ ఉంటే పని మరింత సులభం కానుంది.

కారిడార్ల వారీగా నెంబర్లు

కారిడార్ల వారీగా నెంబర్లు

మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌, నాగోల్‌ నుంచి అమీర్‌పేట కారిడార్లలో పిల్లర్ల నిర్మాణం పూర్తైంది. నవంబర్ 28వ, తేదిన మెట్రో రైలు తొలి దశ పనులు జాతికి అంకితం కానున్నాయి. అయితే మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబర్లను కేటాయించారు. మియాపూర్ తొలి పిల్లర్ కు ఎంవైపీ-01/ఏ అని ఉంటుంది. రెండో పిల్లర్ కు ఎంవైపీ-02/ఏ ఉంటుంది. ఈ నెంబర్ల ఆధారంగా అడ్రస్‌ను సులభంగా గుర్తించవచ్చు.

మెట్రో రైల్వే స్టేషన్లలో సమాచారం

మెట్రో రైల్వే స్టేషన్లలో సమాచారం

మెట్రో రైల్వే స్టేషన్లలో సమీపంలోని కాలనీలు, గృహ సముదాయాలకు సంబంధించిన సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏర్పాటు చేశారు.అంతేకాదు బస్‌స్టేషన్లు, ఆటో స్టాండ్‌ల వంటి రవాణా సదుపాయాల సమాచారాన్ని కూడ పొందుపర్చారు.ఈ సమాచారం ఆధారంగా మెట్రో రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే తమ ప్రాంతాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది.

English summary
Hyderabad Metro Rail authorities have decided to give unique numbering to Metro Rail pillars and link them with Google maps and GPS (Global Position System). It is make to it convenient for citizens to easily identify different locations on metro rail corridors and direction signages for different roads, areas and colonies .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X