• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘యూనివర్సిటీ ఆఫ్ మనవాళ్లు’: సిలికాన్ వ్యాలీలో కన్నింగ్ చైనీస్‌-తెలుగు కూటమి

|

శాన్‌జోస్: 1990ల నుంచి భారత్, చైనా దేశాల నుంచి భారీ సంఖ్యలో అమెరికా విశ్వవిద్యాలయాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడ ఎంతో ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రముఖ మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీల్లో ఒకటైన అర్బన్ ఛాంపియన్‌(యూఐయూసి)లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌ను ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్స్, యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ అని పిలుస్తుండటం గమనార్హం.

న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌జెఐటి)లో మనదేశంలోని బెంగళూరుకు చెందిన అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరూ బెంగళూరు శివారు నగరమైన జయానగర్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆ యూనివర్సిటీని న్యూ జయానగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలుచుకుంటున్నారు. అంతేగాక, మరికొందరు విద్యార్థులు జయానగర్ 4వ బ్లాక్, జయానగర్ 9వ బ్లాక్ జట్లుగా ఏర్పడి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆటలు ఆడుతున్నారు.

ఆసియా విద్యార్థులకు స్వర్గధామమైన మరో యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(యూఎస్‌సి). దీన్ని యూనివర్సిటీ ఆఫ్ స్పాయిల్డ్(చెడిపోయిన) చైనీస్ అని పిలుచుకుంటున్నారు.

రెండు బే ఏరియా స్కూల్స్ అయిన సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ(ఎస్‌వియూ), నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్(ఎన్‌డబ్ల్యూపి) పేర్లు ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా వినబడుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల వీటిలో చదివేందుకు వచ్చిన భారత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో, కొందరు విద్యార్థులు హైదరాబాద్‌ విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు రోజుల నుంచి ఈ కళాశాలల్లో చేరేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వెనక్కిపంపబడ్డారు. కాగా, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీని.. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ నల్గొండ-వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల అని పిలుస్తుంటారు. ఈ రెండు యూనివర్సిటీలను చైనీస్ అమెరికన్ ప్రిన్సిపాళ్లు నిర్వహిస్తున్నారు. వీరే భారత్ నుంచి వచ్చే విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తారు.

ఈ రెండు కళాశాలల్లో ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 5వేల మంది చదువుకుంటున్నారు. అంటే సుమారు 70శాతం మనవాళ్లే ఉండటంతో ఈ యూనివర్సిటీల్లో విద్యార్థులందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు.

అందుకే ఈ యూనివర్సిటీని ‘యూనివర్సిటీ ఆఫ్ మనవాళ్లు' అని పలుచుకుంటున్నారు.

అయితే ఈ ఇనిస్టిట్యూషన్లను యూఐయూసీ, యూఎస్‌సి, ఎన్‌జెఐటి యూనివర్సిటీలతో పోల్చలేం. ఎందుకంటే అవి ఎంతో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాయి. వీటిలో ఇండియా, చైనీయులే ఎక్కువగా ఉంటారు.

University of Manavallu: In Silicon Valley, a dodgy Chinese-Telugu alliance

అయితే, సిలికాన్ వ్యాలీ ఎలా నష్టపర్చింది?

ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు ఇనిస్టిట్యూషన్ల అధికారులను సోమ, మంగళవారాల్లో కరస్పాండెంట్ విచారించారు. అయితే, విద్యార్థుల భవిష్యత్ మాత్రం కొంత కష్టాల్లోనే ఉండిపోయింది. సెమిస్టర్ ముగిసిన నేపథ్యంలో ఈ స్కూల్స్ పరిశీలనలో ఉన్నాయనే వార్తలు రావడం తమను ఆందోళనకు గురిచేసిందని యాజమాన్యం చెబుతోంది. శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చిన కొందరు విద్యార్థులు వెనక్కి పంపించిన ఘటనపై తమకు సరైన సమాచారం లేదని చెబుతున్నారు.

తమ ఇనిస్టిట్యూట్లను బ్లాక్ లిస్టులో పెట్టారనే వార్తలను ఆ స్కూల్స్ యాజమాన్యాలు ఖండించాయి. చట్టబద్దంగా నడుచుకుంటున్నామని చెప్పాయి. తమకు క్యాంపస్, ఫ్యాకల్టీ, క్లాస్ రూం ఉన్నాయని చెబుతున్నాయి. ఇక్కడ అనేక మంది విద్యార్థులు డిగ్రీలు పొందారని తెలిపాయి. అయినప్పటికీ వీటికి చట్టబద్ధత లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఇనిస్టిట్యూట్‌లు ఇక్కడికి వచ్చే అనేక మంది విద్యార్థులపై ప్రభావం చూపుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పదేళ్లలో అనేక ఇంజినీరింగ్ కళాశాలలు వెలిశాయి. ఈ రాష్ట్రంలో 700 ఇంజినీరింగ్ కాలేజీలు, 3లక్షల సీట్లు ఉన్నాయని.. విద్యార్థుల్లేక కొన్ని కళాశాలలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయనే వార్తలు కూడా వినబడుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించకపోవడంతో కొన్ని కళాశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థులకు భారతదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని చైనీస్ అమెరికన్ యాజమాన్యంలో నడుస్తున్న కళాశాలు భారతదేశం నుంచి వస్తున్న విద్యార్థులపై దృష్టి సారించాయి. ఉన్నత ప్రమాణాలున్నాయని చెబుతూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. రూ. 14లక్షలకే సీటు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఎస్‌వియూ, ఎన్‌డబ్ల్యూపి ఇనిస్టిట్యూషన్లు జిఆర్ఈ, జిమ్యాట్ లాంటి టెస్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నాయి. చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పిస్తామంటూ విద్యార్థుల వెంటబడుతున్నాయి.

ఈ ఇనిస్టిట్యూట్లలో భారత విద్యార్థులకంటే చైనా విద్యార్థులు చాలా తక్కువగా ఉంటారు. పాకిస్థాన్‌కు విద్యార్థులు కూడా ఉన్నారని చెబుతుంటారు.

ఈ రెండు ఇనిస్టిట్యూట్లకు పెద్దగా గుర్తింపు లేకపోగా, ఫ్యాకల్టీ కూడా నాణ్యమైన విద్యను అందించే స్థితిలో లేదనే ఆరోపణలున్నాయి. అమెరికా ఎంబసీ, భారత కాన్సులేట్స్ నుంచి ఎప్-1 స్టుడెంట్ వీసా పొందిన వారిని డాక్యుమెంట్లు పరిశీలించి సులభంగా చేర్చుకుంటాయి. అక్రిడైట్‌డ్ ఇనిస్టిట్యూషన్లు చిన్న తప్పు ఉన్నా స్టూడెంట్ వీసాను తిరస్కరిస్తాయి.

కొందరు నెలకి 500 డాలర్లు చెల్లించి ఈ ఇనిస్టిట్యూషన్లలో ప్రవేశం పొందుతున్నారు. మొత్తం కోర్సుకు 20వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, అపార్టుమెంటులో ఐదారుగురు మాత్రమే ఉంటారు. కాగా, ఈ ఇనిస్టిట్యూషన్లలో వారంలో రెండు మూడు రోజులు మాత్రమే క్లాసులు జరుగుతాయి. ఇక్కడ కొందరు న్యాయసమ్మతం కాని పనులు కూడా జరుగుతుంటాయని ఆరోపణలున్నాయి. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారిని ఆఫ్ క్యాంపస్ పని చేయనివ్వరు. కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఇనిస్టిట్యూషన్లు విద్యార్థులను ఇతర పనులకు కూడా ఉపయోగించుకుంటాయి. అయితే వీరికి ఇచ్చే వేతనం చాలా తక్కువగా ఉంటుంది. నకిలీ ధృవపత్రాలు తెచ్చిన విద్యార్థులకు కూడా ఇక్కడ అడ్మిషన్ ఇస్తుండటంతో అమెరికా అధికారులు ఈ ఇనిస్టిట్యూట్లను నిఘా వేశాయి.

సోమవారం శాన్‌ఫ్రాన్సిస్కో వచ్చిన వచ్చిన ఓ భారత విద్యార్థిని 8గంటలపాటు బంధించారు. ఎయిర్ పోర్టు, బోర్డర్ కంట్రోల్, ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని విషయాలపై ప్రశ్నించి తర్వాతే అతడ్ని వదిలిపెట్టారు.

అమెరికాలోని ఇనిస్టిట్యూషన్లలో ప్రవేశం కోరే భారత విద్యార్థులు వాటి గురించిన అధికారిక సమాచారం తెలుసుకున్న తర్వాతే చేరాలని మంగళవారం భారత విదేశాంగ శాఖ సూచించింది. అవసరమైన, సరైన ధృవపత్రాలతోనే వెళ్లాలని కోరింది.

అంతేగాక, ఇటీవల భారత్‌కు చెందిన 14 మంది విద్యార్థులను వెనక్కి పంపిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. ‘సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ(ఎస్‌వీయూ), నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ(ఎన్‌పీయూ)ల్లో చేరిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిన అంశాన్ని అమెరికా విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లాం. వారి స్పందన కోసం చూస్తున్నాం' అని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

అమెరికాలోని రెండు విశ్వవిద్యాలయాల్లో చేరటానికి శాన్‌ఫ్రాన్సికోకు వెళ్తున్న 19 మంది విద్యార్థులను ఎయిరిండియా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిలువరించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయాలపై ‘నిఘా' ఉండటం వల్ల 14 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించినట్టు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం సూచించటంతో ఈ చర్య తీసుకుంది.

English summary
Back in the 1990s, the proliferation of students from India and China to American universities gave rise to some charming abbreviation expansions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X