హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానా

మెట్రో రైలు ప్రాజెక్టు ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీని ఆహ్వనించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీని ఆహ్వనించింది. అయితే దేశంలోనే ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేసే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలను అతిక్రమించినవారికి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష కూడ విధించే అవకాశాలు కూడ లేకపోలేదు.

హైద్రాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెలాఖరులో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వచ్చే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ఈ నెలాఖరులో ప్రారంభించాలని సర్కార్ సన్నాహలు చేస్తోంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ళ పాటు జైలు

నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ళ పాటు జైలు

హైద్రాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేసే సమయంలో నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని మెట్రో రైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు.మెట్రో రైలులో ప్రయాణించే సమయంలో ప్రయాణీకులు మాత్రం విధిగా సంస్థ సూచనలను తప్పకుండా పాటించాలని తేల్చి చెప్పింది. మంగళవారం నాడు మెట్రో రైలు అధికారులు ప్రయాణీకులు పాటించాల్సిన సూచనలను విడుదల చేశారు. ఈ సూచనలను ప్రతి మెట్రో రైల్వే స్టేషన్‌లో ఉంచనున్నారు. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 10 ఏళ్ళ పాటు జైలు శిక్షను విధించనున్నారు.జైలు శిక్షతో పాటు జరిమానాను కూడ విధించే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు.

మెట్రో రైలులో విధ్వంసానికి దిగితే ఇక అంతే

మెట్రో రైలులో విధ్వంసానికి దిగితే ఇక అంతే

మెట్రో రైల్ చట్టం-2002 ప్రకారం కొన్ని ఉల్లంఘనలకు జైలు శిక్ష విధిస్తారు. విధ్వంసక చర్యలకు దిగేవారికి సెక్షన్‌-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించనున్నారు.ఈ మేరకు ప్రయాణీకులు రైలులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.రైల్వే స్టేషన్లలో నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. అయితే మెట్రో రైలులో ప్రయాణం వల్ల త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కానీ, అదే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే అదే స్థాయిలో శిక్షలను కూడ ఎదుర్కోవాల్సి వస్తోంది.

మెట్రో రైలులో 974 ప్రయాణం

మెట్రో రైలులో 974 ప్రయాణం

ఒక్కో మెట్రో రైలులోని మూడు కార్లలో ఒకేసారి గరిష్ఠంగా 974 మంది ప్రయాణించే వీలుంది. ప్రతి మెట్రో రైలులో 126 మంది కూర్చోని ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు 848 మంది నిలబడి ప్రయాణించడానికి అనువుగా డిజైన్‌ చేశారు. హైద్రాబాద్ మెట్రో రైలు డ్రైవర్ లేకుండానే నడుస్తోంది. కంట్రోల్ రూమ్ నుండి రైలును ఆపరేట్ చేస్తారు. కంప్యూటర్ సహయంతో రైలు నడుస్తోందని అధికారులు ప్రకటించారు.

పలు భాషల్లో నిబంధనల బోర్డులు

పలు భాషల్లో నిబంధనల బోర్డులు

మెట్రో రైలులో ప్రయాణం చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై రైల్వే స్టేషన్లలో పలు భాషల్లో నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు.తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో నోటీసు బోర్డులో పెట్టారు.మెట్రో రైలులో ప్రయాణం చేసే సమయంలో ఈ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు ప్రకటించారు. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేయాలన్న కోరికతో నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.

English summary
Passengers violating Metro rules can face a maximum of 10 years imprisonment and in some cases, fine will also be imposed. However, for some offences under the Metro railways (operation and maintenance) Act, 2002, there is no fine but compulsory jail sentence. For three offences under the Act, the punishment is up to 10 years imprisonment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X