వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం శాశ్వతం కాదు, ఢిల్లీకి చాలా క్లియర్ మెసేజ్: కేటీఆర్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధికారం అనేది శాశ్వతం కాదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని యూపీ చాలా స్పష్టమైన సందేశంగా ఢిల్లీకి పంపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆయన గురువారం ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు.

ఏదీ శాశ్వతం కాదని మరోసారి ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ద్వారా స్పష్టమైందని కేటీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర తగ్గిపోయిందన్న ఆయన.. ఆఖరికి అవి డిపాజిట్లు కూడా రాని దుస్థితిలో పడినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురవడాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

UP has sent a clear message: KTR on UP bypolls

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో ఎన్నికలను ఒక రిహార్సల్‌గా భావించిన కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్‌ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది.

20 ఏళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో ఒప్పందం చేసుకొని ఒక్కటై బీజేపీని ఓడించాయి. ఈ నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఇది కోలుకోలేని దెబ్బ అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా స్పందిస్తూ ట్విట్టర్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

English summary
Telangana IT and Municipal Minister KT Rama Rao on Thursday said that the public of Uttar Pradesh has sent a clear message by not giving the mandate to the ruling Bharatiya Janata Party (BJP) in the Lok Sabha by-election held for two constituencies. "Interesting to see the election results of the Loksabha seats vacated by UP CM & his Deputy CM. The state that catapulted BJP into the hot seat in Delhi has sent a clear message that nothing is permanent. The other Notional party has lost its deposits & relevance yet again," KTR tweeted. The BJP received an unexpected blow in the by-elections after it lost both Gorakhpur and Phulpur seats, which were previously held by Chief Minister Yogi Adityanath and Deputy Chief Minister Keshav Prasad Maurya respectively. Both seats, especially Gorakhpur, were hence seen as a matter of prestige for the party ruling in both state and Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X