India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాసన మనసులో మాట : రాంచరణ్ స్క్రీన్ కెమిస్ట్రీ చూస్తే- మామ గురించి ఇలా : పర్సనల్ అంటూ షాకింగ్ రిప్లై..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి కోడలు..రాం చరణ్ సతీమణి ఉపాసన సోషల్ యాక్టివిటీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అపోలో ఆస్పత్రుల నిర్వహణతో పాటుగా సామాజిక సేవ..అదే విధంగా యూ ట్యూబ్ ద్వారా ఆరోగ్యం పైన అవగాహన..మహిళల్లో వికాసానికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో తన తాత చెప్పిన అంశాలను పాటిస్తూ..ఇటు మెగా కోడలుగా సామాజిక సేవలోనూ ముందు నిలుస్తున్నారు. మెగాస్టార్ కోడిలిగా.. రాంచరణ్ సతీమణిగా వారి మీద తన అభిప్రాయాలను ఏంటనేది ఉపాసన మాట్లాడిన సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి.

రాం చరణ్ నటించిన ఆ మూవీ చాలా ఇష్టం

రాం చరణ్ నటించిన ఆ మూవీ చాలా ఇష్టం

ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా సమాధానం చెప్పే ఉపాసన ఇప్పుడు అదే చేసారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాం చరణ్ నటించిన సినిమాల మీద తన అభిప్రాయం వెల్లడించారు. చెర్రీ నటించిన సినిమాల్లో తనకు రంగస్థలం చాలా ఇష్టమని ఉపాసన చెప్పుకొచ్చారు. అదే సమయంలో స్క్రీన్ మీద ..సెట్స్ పైన రాం చరణ్ ను చూస్తుంటే మీకు ఎప్పుడైనా ఏదైనా ఫీలింగ్ కలిగిందా అనే ప్రశ్నకు తాను మానవ మాత్రురాలినేని..ఎందుకు కలగదంటూ ప్రశ్నించారు. అయితే, తన అత్త.. రాం చరణ్ తాను ఎక్కడా ఇబ్బంది పడకుండా కంఫర్ట్ గా ఉండేలా ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ ఈ వయసూలోనే ఆయన మాత్రం

మెగాస్టార్ ఈ వయసూలోనే ఆయన మాత్రం

పులువురు హీరోయిన్లు సైతం తనతో సన్నిహితంగా ఉంటారని చెప్పారు. అయితే, రాం చరణ్ ఆలోచనలను..చెర్రీ కష్టపడే విధానాన్ని ఉపాసన అభినందించారు. ఇక, మామ చిరంజీవి సినిమాల గురించి తన అభిప్రాయం బయట పెట్టారు. మెగాస్టార్ నటించిన మూవీల్లో తనకు సైరా సినిమా చాలా ఇష్టమన్నారు. మామ తన వయసును కూడా లెక్క చేయకుండా చేస్తున్న స్టోరీలు...యాక్షన్.. స్టెప్స్ అమేజింగ్ అంటూ అభినందించారు. మెగాస్టార్ చేస్తున్న సేవాల కార్యక్రమాలను ఉపాసన ప్రశంసించారు.

 తెలంగాణ బిడ్డనని చెబుతూ..

తెలంగాణ బిడ్డనని చెబుతూ..

ఇక, ఉపాసన తాను తన తాత చెప్పిన విధంగా అపోలోను పర్యవేక్షిస్తూనే... వెల్ నెస్ సెంటర్లు నిర్వహణ గురించి వివరించారు. అసలు ఆస్పత్రులకు రాకుండా చూడాల్సిన బాధ్యత తమ పై ఉందని తన తాత చెప్పిన మాటలను ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దాని కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక, తన యూ ట్యూబ్ ద్వారా మహిళల ఆరోగ్యం..వారి వికాసం కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. తాను తెలంగాణ బిడ్డని అంటూ వ్యాఖ్యానించారు. తాను గార్డెనింగ్.. ప్రోగ్రాంల నిర్వహణలో తనకు సమంత సహకరించారని చెప్పారు.

సమంత వండర్ ఫుల్ పర్సన్

సమంత వండర్ ఫుల్ పర్సన్

సమంత వండర్ ఫుల్ పర్సన్ అంటూ ఉపాసన వ్యాఖ్యానించారు. చాలా హెల్పింగ్ ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఇక, ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఉపాసన..లేదా జూనియర్ రాం చరణ్ ఎప్పుడు వస్తారని ప్రశ్నకు ఉపాసన చాల క్లియర్ గా సమాధానం చెప్పారు. అది పూర్తిగా తమ పర్సనల్ అంశమంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారని..కానీ, తాను మాత్రం ఇప్పుడు ఎపిడమిక్ పరిస్థితుల్లో ఏ రకమైన సాయం చేయగలననే అంశం పైనే ఫోకస్ చేస్తున్నానని స్పష్టం చేసారు.

English summary
Mega Daughter-In-Law Upasana had revealed about her favourite movie and also about her father in law Chiranjeevi. Upasana kept away when it came to children issue and clarified that it was her personal issue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X