హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ నరబలి: వెలుగుచూసిన కొత్త కోణాలు, 'చీపురు.. ఎలుక' కీలకంగా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనేకానేక ట్విస్టుల నుంచి ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ఉప్పల్ నరబలి కేసులో నిజానిజాలు నిగ్గు తేలిన సంగతి తెలిసిందే. అయితే కేసును చేధించడంలో ఇప్పటిదాకా వెలుగులోకి రాని మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

Recommended Video

Human Sacrifice Baby's Head Case Mystery Solved

ప్రధానంగా రాజశేఖర్ ఎదురింట్లో ఉండే నరహరిపై పోలీసులకు అనుమానం కలగడానికి, అలాగే రాజశేఖర్ ను పట్టించడానికి దోహదపడ్డ కొన్ని కీలక అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..

నరహరినే అనుమానించారు..:

నరహరినే అనుమానించారు..:

నరబలి కేసులో క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ కంటే ఎక్కువగా అతడి ఇంటి ఎదురింట్లో ఉండే మెకానిక్‌ నరహరి పైనే పోలీసులు ఎక్కువగా అనుమానపడ్డారు.

జనవరి 1వ తేదీ ఉదయం రాజశేఖర్ అత్త ఇంటి డాబాపై 'చిన్నారి తల'ను చూసి కేకలు వేయగానే.. ముందుగా మెకానిక్ నరహరే అక్కడికే వెళ్లాడు. దగ్గరికెళ్లి ఆ తలను పరిశీలించాడు.

దీంతో డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో.. జాగిలాలు నరహరి ఇంట్లోకే వెళ్లాయి. అయితే అసలు విషయం తెలియని పోలీసులకు ఈ ఘటన అతనిపై మరిన్ని అనుమానాల్ని బలపరిచింది.

తేల్చేశారు: చిన్నారిది నరబలే!, రాజశేఖరే నిందితుడు.. అదే పట్టించింది..తేల్చేశారు: చిన్నారిది నరబలే!, రాజశేఖరే నిందితుడు.. అదే పట్టించింది..

చచ్చిన ఎలుక దొరకడంతో..:

చచ్చిన ఎలుక దొరకడంతో..:

అప్పటికే ఒకసారి నరహరి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. ఈ నెల 9వ తేదీన మరోసారి అతని ఇంట్లో గాలించారు. ఆ సమయంలో ఒక గది నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో బాలిక మొండేన్ని అందులోనే దాచి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఆ గదిలో ఓ మూలకు చనిపోయిన ఎలుక దొరకడంతో నరహరిపై అనుమానాలు తొలగిపోయాయి.

రాజశేఖర్ తెలివిగా..:

రాజశేఖర్ తెలివిగా..:


నరబలి తర్వాత రాజశేఖర్ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఎక్కడా రక్తపు మరకలు లేకుండా.. ఆ వాసనే రాకుండా ఫ్లోర్ క్లీనర్లతో అంతా కడిగేశాడు.

డాగ్ స్క్వాడ్ సైతం నీటితో కడిగేసిన చోట వాసనను గుర్తించలేదు. అందుకే పోలీసులు జాగిలాలను తీసుకొచ్చిన రోజు.. అవి రాజశేఖర్ ఇంటి వద్ద తచ్చాడాయి తప్పితే లోపలికి వెళ్లలేదు.

ఆ చీపురు..:

ఆ చీపురు..:

ఈ నెల 9వ తేదీన రాజశేఖర్ ఇంటి డాబాపై పోలీసులు మరోసారి తనిఖీలు చేపట్టారు. తనిఖీల కోసం ఫోరెన్సిక్ నిపుణులను సైతం వెంటబెట్టుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడే ఓ చీపురును గుర్తించారు.

ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్‌ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై ఆ చీపురును ఉంచారు. ఆ చీపురును పరిశీలించగా.. అందులో కుంకుమ ఉన్నట్టు గుర్తించారు. పైగా ఆ చీపురు సైతం ఎండు గరిక, దారంతో కట్టి చేసింది కావడంతో.. దాన్ని క్షుద్ర పూజల కోసమే ఉపయోగించి ఉంటారన్న పోలీసుల అనుమానం బలపడింది.

చిన్నారి వివరాల కోసం..:

చిన్నారి వివరాల కోసం..:

నరబలి మిస్టరీ వీడినప్పటికీ.. హత్యకు గురైన చిన్నారి ఎవరన్నది మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం. చిన్నారి వివరాలను రాబట్టడంలో ఆమెను హత్య చేయడానికి వాడిన కత్తి, మొండం, కీలకం కావడంతో వాటిని గుర్తించడం కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

English summary
The severed head of a baby found atop a house in Uppal here a fortnight ago was part of a human sacrifice executed by the house-owner and his wife “to get relieved of evil spirits”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X