చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్, జుట్టు లాక్కొని కొట్టుకున్న మహిళలు (ఫోటోలు)

హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీపై తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన నిరసన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. చల్గల్, సత్తుపల్లి, ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.
టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించడానికి వచ్చిన చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.

టిడిపి, కాంగ్రెస్ ఉన్నచోటే నిరసనలు
కేసీఆర్ పంపిణీ ఏర్పాట్లతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. కాగా, కేవలం కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఉన్నచోట మాత్రమే నిరసనలు వ్యక్తం అయ్యాయని, అక్కడి కలెక్టర్లతో మాట్లాడానని మంత్రి కెటిఆర్ ఆయనకు వివరించారు. నిరసన తెలిపిన వారు సైతం మళ్లీ చీరలు తీసుకుని వెళ్లారన్నారు.

కేసీఆర్ ఆగ్రహం
బతుకమ్మ చీరలను తగులబెడతుండటం, చీరల కోసం అక్కడక్కడా నిరసనలు, మహిళలు శాపనార్థాలు పెడుతున్న అంశాలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంపై ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తులెవరు, కేసు నమోదు చేయండి, కేసీఆర్ ఆగ్రహం
నిరసన సంఘటనల వెనుక వాస్తవాలేంటి? వాటి వెనక ఉన్న వ్యక్తులెవరో గుర్తించి, నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా చీరలు తగులబెడుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

మహిళలు చీరలను తగులబెడతారా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న బతుకమ్మ చీరల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేటీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. విమర్శించారు. బతుకమ్మ పండగ సందర్భంలో పువ్వులు కిందపడకూడదని భావించే మహిళలు, ఎక్కడైనా చీరల్ని తగలబెడతారా? అని ప్రశ్నించారు.

మహిళల చేతి నుంచి తీసుకొని నిప్పు పెడుతున్నారు
ఒకవేళ నచ్చకపోతే వాటిని పక్కన పెడతారే తప్ప, ఇలా తగలబెట్టరని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
కొన్నిచోట్ల మహిళల చేతి నుంచి లాక్కొని మరీ కాంగ్రెస్ నేతలు చీరలకు నిప్పుపెట్టారని చెప్పారు.

భయపడి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు
చీరల పంపిణీపై తాను స్వయంగా అభిప్రాయాలు కూడా సేకరించానని, పండగకు అన్నదమ్ములు చీర పెట్టినట్లుగా మహిళలు భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి విపక్షాలకు గుండెలు అదురుతున్నాయని, అందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు.

కోటికి పైగా చీరల పంపిణీ
కాగా, బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా తొలి రోజు 25 లక్షల చీరలు పంపిణీ చేశారు. తెలంగాణవ్యాప్తంగా 85వేల సెంటర్లలో పంపిణీ కార్యక్రమం జరిగింది. కోటీ ఆరు లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు.

కుట్ర దాగి ఉందా?
బతుకమ్మ చీరలు తగులబెట్టడం వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మహిళలకు చీరల పంపిణీని ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు.

నచ్చకుంటే తీసుకోకండి
ధనికులైన కాంగ్రెస్, టిడిపి నేతలు చీరలు తీసుకొని తగులబెడుతున్నారని ఈటెల ఆరోపించారు. చీరలు నచ్చకుంటే తీసుకోకుండా ఉండాలే తప్ప, తగులబెట్టడం సరికాదన్నారు. లేదంటే వాటిని పేదలకు ఇవ్వాలన్నారు.

అదో సెంటిమెంట్
మహిళలకు చీర ఇవ్వడం ఓ సెంటిమెంట్ అని ఈటెల అన్నారు. చీర తీసుకోవడాన్ని సెంటిమెంటుగా మహిళలు భావిస్తారన్నారు. చీరలు తగలబెట్టడాన్ని మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖండించారు.

చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మరోవైపు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారుతోంది. క్యూ లైన్లలో తలెత్తిన వివాదం, ఒకరినొకరు సిగలు పట్టుకొని చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. కనీసం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయకుండా గొడవలు జరగకుండా నియంత్రించడేందుకు చర్యలు చేపట్టక పోవడంతో మహిళలు ముష్టియుద్ధాలకు దిగారు.

మహిళలు గొడవ పడ్డారు
మహిళలు కొట్టుకున్న ఈ వివాదం యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. తొలి రోజు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న మహిళలు గొడవ పడ్డారు.

ఒకరి జుట్టు పట్టుకొని మరొకరు కొట్టుకున్నారు
మహిళలు ఒకరి జుత్తు మరొకరు పట్టుకొని గొడవకు దిగారు. దీంతో చీరల పంపిణీ కాసేపు ఆగిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు వారించినప్పటికీ తగ్గలేదు. పోలీసులు అతికష్టం మీద మహిళలను అక్కడి నుంచి పంపించారు.

కేసీఆర్ ఆరా
కాగా, బతుకమ్మ చీరల పంపిణీపై తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన నిరసన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. చల్గల్, సత్తుపల్లి, ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!