వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మరక్షణలో టీఆర్ఎస్: మెడికల్ కాలేజీ హామీపై ఎదురుదాడి ఇందుకేనా?

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ‘స్వ’పక్షంలోనే విపక్షంగా కోమటిరెడ్డి బ్రదర్శ్ వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుసరిస్తున్న తీరుతో జిల్లా.. ఆ పై రాష్ట్ర రాజకీయాలే ప్రభావితం కానున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలోనే 'స్వ'పక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అనుసరిస్తున్న తీరుతో జిల్లా.. ఆ పై రాష్ట్ర రాజకీయాలే ప్రభావితం కానున్నాయి. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యామ్నాయం కోసం చూస్తూ భిన్న ప్రకటనలతో కాలం గడుపుతున్నారు.

నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రాష్ట్ర రైతు సమన్వయ సమితి రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించనున్నారని వార్తలు దండిగా వస్తున్నాయి. అందుకోసం గుత్తా సుఖేందర్ రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయించాలని సీఎం కేసీఆర్ తలపోస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'కోమటిరెడ్డి' బ్రదర్స్ ప్లస్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆసక్తి కర పరిణామం వెలుగులోకి వచ్చింది. మూడున్నరేళ్ల క్రితం తెలంగాణ కొత్త రాష్ట్రంలో సీఎంగా పదవీ బాద్యతలు స్వీకరించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తూ రకరకాల హామీలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆ హామీల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ హామీ ఏర్పాటు కూడా ఒకటి.

కరీంనగర్ ప్లస్ నల్లగొండపై సీఎం కేసీఆర్ శుష్క హామీలిలా

కరీంనగర్ ప్లస్ నల్లగొండపై సీఎం కేసీఆర్ శుష్క హామీలిలా

మెడికల్ కాలేజీ కావాలంటే ఆ ప్రాంతంలో 500 బెడ్లతో కూడిన ఆసుపత్రి, పూర్తి వసతులు కల్పించాల్సి ఉంటుంది. 2014లో కరీంనగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పర్యటించినప్పుడు జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తామని హామీలు గుప్పించారు. కానీ మూడున్నరేళ్ల కాల చక్రం చటుక్కున తిరిగిపోయింది. మళ్లీ సార్వత్రిక ఎన్నికల కోసం మధ్యలో మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మళ్లీ లబ్ది పొందేందుకు అధికార టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ ఆ హామీలు ఏ మేరకు అమలు జరుగుతాయన్నది మాత్రం సందేహస్పదమే.

ఖమ్మంలో ఐటీ పార్క్ కు ఇలా శంకుస్థాపన

ఖమ్మంలో ఐటీ పార్క్ కు ఇలా శంకుస్థాపన

ఆ మాటకు వస్తే జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోపాటు నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జిల్లా కేంద్రంలో కంప్యూటర్ హబ్ ఏర్పాటు చేస్తామని యువ నాయకుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీలు గుప్పించారు. అంతటితో ఆగక హామీలు ఇచ్చిన జిల్లా కేంద్రాల్లో.. ప్రత్యేకించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ విస్మరించి.. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణానికి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు. ఇటీవలే కరీంనగర్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని మళ్లీ హామీ గుప్పించారు.

మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తని సీఎం కేసీఆర్

మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తని సీఎం కేసీఆర్

కానీ నల్లగొండ జిల్లాలో 2010లో కోమటిరెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నల్లగొండలో ఐటీ పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఈ నాటికి నల్లగొండలో ఐటీ పార్క్ ఊసెత్తిన వారే కరువయ్యారు. తమ జిల్లా కేంద్రంలో తాజాగా 72 గంటల్లో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కంటగింపుగా మారింది. ఒకవైపు సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ మరోవైపు టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కోమటిరెడ్డిపై గుత్తా సుఖేందర్ రెడ్డి నోరు పారేసుకున్నారు.

సిద్ధిపేటలో ఆగమేఘాలపై ఇలా మెడికల్ కళాశాలఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్లు జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోలేదో ముందు ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నల్లగొండతోపాటు కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. గతేడాది అక్టోబర్‌లో విజయదశమి సందర్భంగా కొత్త జిల్లా సిద్ధిపేట కేంద్రంగా ఆవిర్భవించిన నాడే కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతే కాదు ఆగమేఘాలపై సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలన్నీ జరుగుతున్నాయి.

సిద్ధిపేటలో ఆగమేఘాలపై ఇలా మెడికల్ కళాశాలఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్లు జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోలేదో ముందు ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నల్లగొండతోపాటు కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. గతేడాది అక్టోబర్‌లో విజయదశమి సందర్భంగా కొత్త జిల్లా సిద్ధిపేట కేంద్రంగా ఆవిర్భవించిన నాడే కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతే కాదు ఆగమేఘాలపై సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలన్నీ జరుగుతున్నాయి.

ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్లు జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోలేదో ముందు ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నల్లగొండతోపాటు కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. గతేడాది అక్టోబర్‌లో విజయదశమి సందర్భంగా కొత్త జిల్లా సిద్ధిపేట కేంద్రంగా ఆవిర్భవించిన నాడే కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతే కాదు ఆగమేఘాలపై సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలన్నీ జరుగుతున్నాయి.

మనుగడ కోసమే గుత్తా ఆరోపణలు ఇలా

మనుగడ కోసమే గుత్తా ఆరోపణలు ఇలా

కరీంనగర్‌తోపాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనకు దిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డిలను అరెస్ట్ చేసి అణచివేతకు పాల్పడిన నేపథ్యం తెలంగాణ ప్రభుత్వాధినేతది. ఈ విషయాలన్నీ విస్మరించి మరీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ త్వరలో జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వనున్నారని.. ఆ సంగతి తెలిసే కోమటిరెడ్డి దొంగ నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని బెదిరింపులకు దిగారని సెలవిచ్చారు.

గుత్తా ప్రత్యారోపణల నేపథ్యం ఏమిటి?

గుత్తా ప్రత్యారోపణల నేపథ్యం ఏమిటి?

కానీ గతంలో ఇచ్చిన హామీ అమలు మేరకు మూడేళ్లుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటీ పార్క్, మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయమై గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఎందుకు పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైన ప్రతిసారి రాజకీయ నాయకులు హామీలు ముందుకు తేవడం సర్వ సాధారణంగా మారింది. రాజకీయ పరిశీలకులు భావిస్తున్నట్లు.. ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించినట్లే తెలంగాణలో ఉప ఎన్నిక జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా? లేదా? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలిసిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Telangana Government has misleaded opposition parites, people on medical colleges. In 2014 KCR after taking oath as CM of Telangana, he assured to establish medical college in Nalgonda and Karim Nagar district head quarters. But after 3 and half years his assurances didn't fullfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X