• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏడాది ఉగ్రచెర వీడింది: తెలుగు ప్రొఫెసర్ల ఫోన్, ఫ్యామిలీస్ హ్యాపీ(పిక్చర్స్)

|

హైదరాబాద్‌: లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఏడాదికి(14నెలలు)పైగా బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్ల కథ సుఖాంతమైంది. 2015 జులై 29 నుంచి కిడ్నాపర్ల చెరలో బందీలుగా ఉన్న వారిని రక్షించినట్లు భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. 'గత ఏడాది జులై 29 నుంచి లిబియాలో బందీలుగా ఉన్న టి.గోపాలకృష్ణ (ఏపీ), సి.బలరాం కిషన్‌ (తెలంగాణ)ను రక్షించినట్లు చెప్పడానికి సంతోషిస్తున్నాం' అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రక్షించిన అమెరికా దళాలు లిబియాలోని సిర్ట్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు గత ఏడాది జులై 29న ట్రిపోలి నుంచి స్వదేశానికి వచ్చేందుకు విమానాశ్రయానికి కారులో వెళ్తుండగా అపహరణకు గురయ్యారు.

అప్పటి నుంచి వీరి విడుదల కోసం కేంద్రప్రభుత్వం పలు దఫాలుగా లిబియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వారు క్షేమంగా ఉన్నారనే సమాచారమే తప్ప ఆచూకీ లభించలేదు. బుధవారం రాత్రి మిస్రెట పట్టణంలో ఉన్న ఆరుగురు బందీలను అమెరికా సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. అందులో వీరిద్దరితోపాటు, లిబియా, కొరియాకు చెందిన మరో నలుగురు ఉన్నారు.

మరో మూడు నాలుగు రోజుల్లో వీరిద్దరూ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రిపోలిలోని రాయబార కార్యాలయం నుంచి బుధవారం రాత్రి 10 గంటలకు గోపీకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ అర నిమిషంపాటు భార్య కల్యాణి, తండ్రి నారాయణరావులతో మాట్లాడారు. దీంతో గోపీకృష్ణ ఇంట్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాచారం ప్రాంతంలో గోపికృష్ణ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ తన సోదరుడు గోపికృష్ణ శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్న తమ తల్లితండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు.

గురువారం తెల్లవారుజామున బలరాం సైతం కుటుంబసభ్యులకు ఫోన్‌లో మాట్లాడారు.

తన భర్త క్షేమంగా ఉన్నారని, చెర నుంచి విడుదలయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫోన్ చేసి చెప్పారని బలరాం కిషన్ భార్య శ్రీదేవి తెలిపారు. కాగా ఈ మేరకు తన భర్త కూడా ఫోన్ చేసి చెప్పారని ఆమె అన్నారు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే తన భర్త ఫోన్‌లో మాట్లాడారన్నారు. పిల్లలు, కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి తెలుసుకున్నారన్నారు.

'ఏడాది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నా భర్త గొంతును విన్నాను. ఇంతకంటే ఆనందం మరొకటి ఏముంటుంది' అంటూ ఆమె ఉద్వేగంగా ప్రతిస్పందించారు. నగరంలో హబ్సీగూడ ప్రాంతంలో శ్రీదేవి కుటుంబం ఉంటోంది.

 బలరాం కిషన్ ఫ్యామిలీ

బలరాం కిషన్ ఫ్యామిలీ

లిబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు కొద్దిరోజుల క్రితం వీరిద్దరి చిత్రాలతో గోడపత్రికలు ముద్రించి లిబియాలో పలు చోట్ల అతికించారు. ఇవి బాగా ప్రచారం కావడంతో అమెరికా సైనిక బలగాల ఆధీనంలో ఉన్న గోపీకృష్ణను సిర్ట్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు వెంటనే గుర్తించారు. ఆ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. దాన్ని చూసిన లిబియాలోని గోపీకృష్ణ మిత్రులు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

ప్రొఫెసర్ బలరాం కిషన్ ఫ్యామిలీ

ప్రొఫెసర్ బలరాం కిషన్ ఫ్యామిలీ

అయినా గోపీకృష్ణ స్వయంగా మాట్లాడే వరకు తమకు నమ్మకం కుదరలేదని ఆయన సోదరుడు మురళీకృష్ణ తెలిపారు. అప్పట్లో వీరితో పాటుగా కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్‌, విజయ్‌కుమార్‌ను ఉగ్రవాదులు అపహరించారు. అయితే వారిద్దరిని రెండు రోజుల అనంతరమే వదిలివేశారు. రెండు కుటుంబాల్లో ఆనందం: ఎట్టకేలకు బందీల నుంచి విడుదల కావడంతో రెండు కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

బలరాం కిషన్ కుటుంబం

బలరాం కిషన్ కుటుంబం

గోపీకృష్ణ తల్లిదండ్రులు తిరువీధుల నారాయణరావు, సరస్వతి శ్రీకాకుళం జిల్లా టెక్కలి గొల్లవీధిలో నివసిస్తున్నారు. భార్య కల్యాణి, పిల్లలు జాహ్నవి(10), కృష్ణసాయిశ్వర్‌(5)లు హైదరాబాద్‌లోని నాచారం రాఘవేంద్రనగర్‌లో ఉంటున్నారు. సంతానం. బలరాం కిషన్‌ కుటుంబసభ్యులు అల్వాల్‌లోని కానాజిగూడ సాయినగర్‌లో ఉంటున్నారు.

గోపాలక్రిష్ణ ఫ్యామిలీ

గోపాలక్రిష్ణ ఫ్యామిలీ

వీరి విడుదలకు చొరవతీసుకున్న సుష్మాస్వరాజ్‌కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరినీ సాధ్యమైనంత త్వరగా విడుదల చేయించడానికి చర్యలు తీసుకోవాలని గతంలో చాలాసార్లు సుష్మాస్వరాజ్‌కు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఏడాది ఉగ్రచెర వీడింది: తెలుగు ప్రొఫెసర్ల ఫోన్, ఫ్యామిలీస్ హ్యాపీ(పిక్చర్స్)

ఏడాది ఉగ్రచెర వీడింది: తెలుగు ప్రొఫెసర్ల ఫోన్, ఫ్యామిలీస్ హ్యాపీ(పిక్చర్స్)

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, రాష్ట్ర సమాచార, ఎన్నారై వ్యవహారాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కార్మికశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం తెలిపారు.

 స్వీట్లు పంచిన కుటుంబసభ్యులు

స్వీట్లు పంచిన కుటుంబసభ్యులు

రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ అర నిమిషంపాటు భార్య కల్యాణి, తండ్రి నారాయణరావులతో మాట్లాడారు. దీంతో గోపీకృష్ణ ఇంట్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాచారం ప్రాంతంలో గోపికృష్ణ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ తన సోదరుడు గోపికృష్ణ శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్న తమ తల్లితండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు.

English summary
Two Telugu professors, who were held captive by the ISIS for more than a year in Libya, were freed on Wednesday night. The duo, who were rescued in a military action on an ISIS base, are likely to arrive here in the next three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X