వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంక పర్యటన: మహేందర్ రెడ్డికి అమెరికా సీక్రెట్ సర్వీసెస్ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Us Secret Services team praises Telangana Police | Oneindia Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు, సలహాదారు ఇవాంక హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు నిర్వహించిన పాత్రకు సర్వత్రా ప్రశంంసలు లభిస్తున్నాయి.

సాంంకేతిక పరిజ్ఞానంలో విశేషమైన నైపుణ్యం గల తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిది అందులో కీలకమైన పాత్ర. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ఇవాంక పర్యటనలో ఏ విధమైన భద్రతా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆయనకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ నుంచి కూడా ప్రశంసలు అందాయి.

 డిజిపి సీక్రెట్ సర్వీసెస్ ప్రశంస

డిజిపి సీక్రెట్ సర్వీసెస్ ప్రశంస

తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్‌రెడ్డికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ కూడా రాసింది ఇవాంకా పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని ప్రశంసించింది.

మహేందర్ రెడ్డికి లేఖ

మహేందర్ రెడ్డికి లేఖ

భద్రతా ఏర్పాట్లను కొనియాడుతూ అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ టీం హెడ్‌ రిచర్డ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఎంతో సహనంతో, విరామం లేకుండా తెలంగాణ పోలీసు అధికారులు అందించిన సేవల వల్లే ఇవాంకా పర్యటన విజయవంతమైందని అభిప్రాయపడ్డారు.

ఇవాంక సంతోషం వ్యక్తం చేశారు...

ఇవాంక సంతోషం వ్యక్తం చేశారు...

మీ సేవల పట్ల ఇవాంకా కూడా సంతోషం వ్యక్తం చేశారని హెడ్ రిచర్డ్ ఆ లేఖలో తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని కూడా రాశారు. అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌తో పాటు కేంద్ర హోం శాఖ, నీతి ఆయోగ్‌, వివిధ దేశాల ప్రముఖుల నుంచి కూడా తెలంగాణ పోలీసులకు ప్రశంసలు అందాయి. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు జిఈఎస్‌తో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నప్పటికీ ఏ మాత్రం లోపాలు లేకుండా పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు.

ఇవాంక పర్యటన అంతా రహస్యంగానే....

ఇవాంక పర్యటన అంతా రహస్యంగానే....

ఇవాంకా పర్యటన అంతా రహస్యంగానే జరిగింది. అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఆమె కదలికలపై చివరి క్షణంలో మాత్రమే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ప్రత్యేక విమానంలో వస్తారని తొలుత చెప్పారు. చివరికి సాధారణ ప్రయాణికుల విమానంలోనే వచ్చారు. వెస్టిన్‌ హోటల్లో బస చేస్తారని చెప్పి చివరి నిమిషంలో ట్రైడెంట్‌కు మార్చారు. అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బి లు రూపొందించుకుని అత్యంత సమర్థంగా వ్యవహరించారు.

English summary
US secret Services has praised Telangana police for making security arrangements in commandable manner during Ivanka Trump Hyderabad visit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X