వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూర్‌నగర్ నుంచి వెళ్లిపోండి.. ఉత్తమ్‌కు ఎస్పీ ఫోన్.. నేనే లోకల్ అంటున్న పీసీసీ చీఫ్

|
Google Oneindia TeluguNews

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన మేరకు అధికారులు నడుచుకొంటున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భర్త ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ ఫోన్ చేశారు. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

 సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్

ఉత్తమ్ వర్సెస్ ఎస్పీ

ఉత్తమ్ వర్సెస్ ఎస్పీ

ఎస్పీ సూచనపై ఉత్తమ్ ఫైరయ్యారు. తనను వెళ్లిపోమనడం సరికాదన్నారు. తనది హుజూర్‌నగర్ అని.. వేరే ప్రాంతం కాదని తేల్చిచెప్పారు. స్థానికుడినని.. నాన్ లోకల్ కాదని తేల్చిచెప్పారు. ఈ ప్రాంత పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. తనకు ఇక్కడే ఇల్లు ఉంది అని పేర్కొన్నారు. తనను వెళ్లిపోవాలని కోరడం సరికాదని సూచించారు.

బంతి ఈసీ కోర్టుకు

బంతి ఈసీ కోర్టుకు

జిల్లా ఎస్పీ సూచనను ఉత్తమ్ తప్పుపట్టారు. తనను వెళ్లిపోవాలని కోరినా అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు. తాను ఈ ప్రాంత వాసినని తెలిపారు. ఉత్తమ్ వాదనతో ఈసీ ఏకీభవించింది. ఆయన హుజూర్‌నగర్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఉత్తమ్‌కు కోదాడలో ఓటు హక్కు ఉంది. ఆయన హుజూర్ ‌నగర్‌లో ఉండేందుకు వీలులేదని ఎస్పీ సూచించారు. విషయాన్ని ఉత్తమ్ ఈసీ దృష్టికి తీసుకెళ్లడం.. అక్కడ సానుకూలంగా నిర్ణయం రావడంతో కాంగ్రెస్ పార్టీకి కలిసిసొచ్చినట్లైంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఉత్తమ్‌కు ఫోన్ చేయడం కలకలం రేపింది. వెంటనే ఉత్తమ్ ఈసీని ఆశ్రయించడం.. సానుకూలంగా నిర్ణయం వచ్చిన సంగతి తెలిసిందే. హుజూర్‌నగర్‌లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది.

చీలనున్న ఓట్లు

చీలనున్న ఓట్లు

బీజేపీ అభ్యర్థి కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి మాత్రం ఓట్లను చీల్చతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. వీరితోపాటు తీన్మార్ మల్లన్న, ఓయూ, కేయూ విధ్యార్థులు కూడా ఓట్లను చీల్చుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ గెలిచిన 5 నుంచి 10 వేల ఓట్లతో మాత్రమే విజయం సాధిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

English summary
suryapeta sp call to pccc chief uttam kumar reddy. outsiders not in huzurnagar.. you have to go town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X