వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 వరకు ఉత్తమ్‌కే పగ్గాలు, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం: కుంతియా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు. ఎన్నికలవరకు తనతో పాటు రాష్ట్రంలో ఏ పదవుల్లో మార్పులు చేర్పులు ఉండబోవని ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటే ఇక నుండి ఫైనల్ అంటూ ఆయన పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు.

ఎన్నికలకు ఆరు మాసాల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో పొత్తు విషయమై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారెవరైనా కఠినంగా చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతృప్తికరంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Uttamkumar reddy will continues as TPCC president up to 2019 elections

ఎవరితో ఎప్పుడు కలవాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. పొత్తులపై పీసీసీ నుండి ఎలాంటి ప్రతిపాదనలను రాలేదన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడం ప్రజలు తమవైపు చూస్తున్నారని చెప్పేందుకు నిదర్శనమన్నారు జగ్గారెడ్డి.

పార్టీలోని అన్ని స్థాయిలోని నేతల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. పార్టీలో ఎవరిని కూడ విస్మరించబోమన్నారు కుంతియా.మణిశంకర్ అయ్యర్, జైరామ్ రవేష్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవన్నారు. పార్టీ గెలిచిన చోట రాహుల్‌ను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ అధికారాన్ని లాక్కోందన్నారు కుంతియా.

English summary
Uttamkumar reddy will continues as TPCC president up to 2019 elections said Telangana congress party incharge Kuntia. Kuntia chit chat with media at Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X