వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"నోట్ల రద్దుపై.. చంద్రబాబు-కేసీఆర్‌లకు ముందుగానే సమాచారం"

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నోట్ల రద్దుకు తాము వ్యతిరేకం కాదంటూ ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్.. మోడీ నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఏపీ సీఎం చంద్రబాబుకు ముందుగానే అందిందని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ముందుగానే సర్దుకుని లబ్ది పొందారన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయని సందేహం వ్యక్తం చేశారు.

Uttham kumar Reddy allegations on Chandrababu and KCR

నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఉత్తమ్.. సామాన్యుల ఇబ్బందులు గట్టెక్కాక.. ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని సూచించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య జనం నానా కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల పడుతున్న ఇబ్బందులను మోడీ సర్కార్ పట్టించుకోనందుకే తాము నిరసన
తెలుపుతున్నామని పేర్కొన్నారు. ముందుగానే తన సన్నిహితులకు, అనుకూల సీఎంలకు, కార్పోరేట్ వ్యాపారులకు మోడీ ముందుగానే సమాచారాన్ని లీక్ చేశారని ఆరోపణ చేశారు. కేంద్రం
తీసుకున్న నిర్ఱయంపై సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
Telangana congress chief Uttham Kumar Reddy made allegations on Both telugu states CMs that they know information of currency ban befor announcing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X