• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ కొత్త పాలసీపై కిరికిరి.. రైతులు ఓకె.. కానీ ప్రభుత్వం అందుకు సిద్దమా..?

|

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. రైతులను ధనవంతులను చేసేందుకు నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. మార్కెట్ డిమాండుకు అనుగుణంగా పంటలు పండించడం అలవరుచుకోవాలని.. తద్వారా తెలంగాణ పంటలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని ఆయన అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలసీని పక్కనపెట్టి వచ్చే ఏడాది కొత్త పాలసీ రూపొందించాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వ్యవసాయ పాలసీని ఉద్దేశించి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్

రైతులకు క్షమాపణ చెప్పాలన్న ఉత్తమ్

రైతులకు క్షమాపణ చెప్పాలన్న ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేయాలనుకుంటున్న నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానం లోపభూయిష్టంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగైదు రోజుల్లో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్దంగా ఉన్న తరుణంలో.. చెప్పిన పంటే వేయాలని రైతులను ఆదేశించడం తుగ్లక్‌ చర్యగా భావిస్తున్నామన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పాలసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దాన్ని పక్కనపెట్టి, రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది కొత్త పాలసీ రూపొందించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ధాన్యం కొనుగోలు విషయంలో వైఫల్యం చెందినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఊరుకోమని హెచ్చరిక..

ఊరుకోమని హెచ్చరిక..

రైతులపై కేసీఆర్ బెదిరింపు ధోరణి సరికాదని.. మొక్కజొన్న రైతులపై ఆంక్షలు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు కట్ చేస్తామని చెప్పడం రైతులను అవమానించడమేనని అన్నారు. ఇలాగే రైతు వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తే కాంగ్రెస్ పోరాటానికి దిగుతుందన్నారు. దరిద్రపు టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని గుర్తుచేశారు.

పత్తి పండించేందుకు ఓకె... కానీ మీరు అందుకు సిద్దమా..

పత్తి పండించేందుకు ఓకె... కానీ మీరు అందుకు సిద్దమా..

రైతులకు రూ.1లక్షరుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించిన ఉత్తమ్.. రైతు బంధు 40శాతం రైతులకు ఇంకా ఎందుకు అందలేదని నిలదీశారు. కేసీఆర్ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. పత్తి విత్తనాలు, కొనుగోలు, ధరలు ఇవేవీ తమ చేతిలో లేనప్పుడు పత్తి మాత్రమే పండించమని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్టు రైతులు పత్తి పండిస్తారని.. అయితే క్వింటాలుకు రూ.7వేలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే పత్తి కొనేలా హామీ ఇ‍వ్వాలని అన్నారు. ఇదే అంశంపై మంగళవారం(మే 19) ట్వీట్ చేసిన ఉత్తమ్.. 2016లో పత్తి పంట సాగు చేయవద్దని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పత్తి వేయకపోతే రైతు బంధు కట్ చేస్తామనడం ఏం పద్దతి అని ప్రశ్నించారు.

  Railways To Start 200 Non-AC Special Passenger Trains From June 1st
  కొత్త పాలసీ ఇదే..

  కొత్త పాలసీ ఇదే..

  సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఎకరాల చొప్పున 2604 క్లస్టర్స్‌ను ఏర్పాటు చేశామని రెండు రోజుల క్రితం కేసీఆర్ వెల్లడించారు. ఈ క్లస్టర్స్ అన్నింటిలో రాబోయే రోజుల్లో రైతు వేదికల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై నియంత్రిత పద్దతిలోనే రాష్ట్ర వ్యవసాయ విధానం ముందుకు సాగుతుందన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు,వ్యాపార సంస్థలు,రైతులు,రైస్ మిల్లర్స్.. ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులతో అనేక భేటీలు నిర్వహించి ఈ విధానాన్ని రూపొందించామన్నారు. దీని ప్రకారం.. ఈసారి వానాకాలంలో 70లక్షల ఎకరాల్లో పత్తి,40లక్షల ఎకరాల్లో వరి,15లక్షల ఎకరాల్లో కంది పండించాలని నిర్ణయించామన్నారు. అలాగే స్వతహాగా 2లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేయవచ్చన్నారు. నిజామాబాద్,నిర్మల్,జగిత్యాల,కేసముద్రం,మహబూబాబాద్ జిల్లాల్లో 1.20 లక్షల ఎకరాల్లో పసుపు పండుతుందని.. దాన్ని కొనసాగించవచ్చునని తెలిపారు. అలాగే డోర్నకల్,మహబూబాబాద్,నర్సంపేట ప్రాంతాల్లో 2.50లక్షల ఎకరాల వరకు ఎండుమిర్చి బాగా పండుతుందని.. కాబట్టి అది కూడా కొనసాగించవచ్చునని చెప్పారు. ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లాల్లో 3.50లక్షల ఎకరాల్లో సోయాబీన్స్ పంటలను కొనసాగించవచ్చన్నారు.అలాగే మామిడి తోటలు,బత్తాయి తోటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు.

  English summary
  TPCC chief Uttham Kumar demanded CM KCR to say apology for farmers for allegedly not buying graining from them. He criticised new agricutlure policy which is proposed by CM recently.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more