వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుల్లో-ఆత్మహత్యల్లో తెలంగాణ నం.1, కేసీఆర్ సర్వేలు బోగస్ : ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇటీవల వరుసగా వెలువడుతున్న పలు సర్వేలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఆయన పాలనకు టాప్ మార్కులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా భోగస్ అని కొట్టిపారేస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి.. కేసీఆర్ పాలన బాగుందంటూ వెలువడిన సర్వేలన్ని బోగస్ అని మండిపడ్డారు.

 Uttham kumar reddy takes on KCR

కేసీఆర్ సర్వే రాజకీయాలు చేస్తున్నారని, సర్వేల వ్యవహారమంతా అబ‌ద్ధాల పుట్టేన‌ని విమర్శించారు. సర్వేలే గనుక నిజమైతే.. టీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. అప్పుల్లో, అన్నదాతల ఆత్మహత్యల్లో, ఎన్నికల హామీలను అమలు చేయ‌క‌పోవ‌డంతో తెలంగాణ‌ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జీహెచ్ఎంసీలోను పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని ఆరోపించారు.

కాగా, నేడు దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మాజీ హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటల్‌ల జ‌యంతిని పురస్కరించుకుని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తమ్. ఈ సందర్బంగా ఇందిరా, సర్దార్ పటేల్ సేవల గురించి కొనియాడిన ఉత్తమ్.. పనిలో పనిగా టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

English summary
TPCC Chief Uttham Kumar Reddy made some firing comments on telangana CM KCR and Trs govt. He alleged that all consecutive surveys which are saying KCR is the best, those were fake
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X