నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తే ఒప్పుకోం: వీహెచ్, ‘శీనన్న అంటే చాలు.. కేసీఆర్ భజనే’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత డీ శ్రీనివాస్‌(డీఎస్)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్ స్పందించారు.

డీఎస్‌ను సస్పెండ్ చేయాలంటూ..

డీఎస్‌ను సస్పెండ్ చేయాలంటూ..

డీఎస్‌‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదని తెలిసింది.

Recommended Video

డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత
డీఎస్ వస్తామంటే ఒప్పుకోం

డీఎస్ వస్తామంటే ఒప్పుకోం

ఈ క్రమంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుతున్న నేపథ్యంలో వీహెచ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు డీఎస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు.

కేసీఆర్ శీనన్న అంటే చాలు..

కేసీఆర్ శీనన్న అంటే చాలు..

ఒక వేళ డీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నా.. కేసీఆర్ మళ్లీ పిలిచి శీనన్న అంటే చాలు.. కేసీఆర్‌కు డీఎస్ భజన చేస్తారని వీహెచ్ ఎద్దేవా చేశారు. అందుకే డీఎస్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలో, వద్దో ఓసారి పార్టీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.

కేసీఆర్‌కు ఓట్లంటేనే ప్రేమ..

కేసీఆర్‌కు ఓట్లంటేనే ప్రేమ..

కేసీఆర్‌కు బీసీలపై ప్రేమ లేదని, వారి ఓట్లపైన మాత్రమే ఉందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, తన అనుచరులు, కార్యకర్తలతో ఇటీవల డీఎస్ సమావేశం కావడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై డీఎస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

English summary
Congress senior leader V Hanumantha Rao on Tuesday fired at D Srinivas for pary change issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X