• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోరోనా స్పైడర్స్ కు వ్యాక్సిన్ ఇస్తే దాన్ని నియంత్రించినట్టే.!సీఎం ఆలోచన భేష్ అంటున్న మంత్రి సత్యవతి.!

|

మహబూబాబాద్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి రెండో దశను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధానాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తున్నాయని అందుకే కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గు ముఖం పట్టాయని మంత్రి సత్యవతి తెలిపారు.

ఏరియా హాస్పిటల్ తనిఖీ చేసిన మంత్రి.. అక్కడే కోవిడ్ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న సత్యవతి

ఏరియా హాస్పిటల్ తనిఖీ చేసిన మంత్రి.. అక్కడే కోవిడ్ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న సత్యవతి

కోవిడ్ స్ప్రెడర్స్ కు మొదటగా వ్యాక్సిన్ ఇవ్వాలనడం ఇందులో భాగమేనని, ఇందుకు సిఎం చంద్రశేఖర్ రావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. జడ్పీ చైర్మన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, అధికారులతో కలిసి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ సందర్శించి, రెండో దశ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో పాటు కోవిడ్ స్పైడర్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించి రోగులను పరామర్శించి వారికి తగిన ముందస్తు జాగ్రత్తలు చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్.

గ్రామాల్లో ఉదృతంగా నియంత్రణ చర్యలు. 450 కమిటీలు పనిచేస్తున్నాయన్న సత్యవతి..

గ్రామాల్లో ఉదృతంగా నియంత్రణ చర్యలు. 450 కమిటీలు పనిచేస్తున్నాయన్న సత్యవతి..

ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్ డౌన్ విధించడం వల్ల లాక్‌డౌన్ కు ముందు 33,34 శాతంగా ఉన్న కోవిడ్ నేడు 8,9 శాతానికి తగ్గిందన్నారు. కోవిడ్ ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించడంతో పాటు కోవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యల వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చాయన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనకనుగుణంగా కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సత్యవతి.

కోవిడ్ స్పైడర్స్ వ్యాక్సిన్ కేంద్రం సందర్శన...వ్యాక్సిన్ తీసుకున్న వారికి జాగ్రత్తలు చెప్పిన మంత్రి

కోవిడ్ స్పైడర్స్ వ్యాక్సిన్ కేంద్రం సందర్శన...వ్యాక్సిన్ తీసుకున్న వారికి జాగ్రత్తలు చెప్పిన మంత్రి

కరోనా కష్టకాలంలో కూడా రైతుకు ఇబ్బంది ఉండకూడదని సిఎం చంద్రశేఖర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ఈ కొనుగోలును అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా వానాకాలం పంటల సమయం వచ్చినందున రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, నీటి సరఫరాలో, కరెంటు విషయంలో సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, నేతలతో కలిసి సమీక్ష చేస్తానని చెప్పారు.

కోవిడ్ బారిన పడ్డ వారికి మెరుగైన వైద్యం.. కష్టపడి వైద్యం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలన్న మంత్రి..

కోవిడ్ బారిన పడ్డ వారికి మెరుగైన వైద్యం.. కష్టపడి వైద్యం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలన్న మంత్రి..

మహబూబాబాద్ పరిసర గ్రామాల్లో కోవిడ్ ను కట్టడి చేసేందుకు 450 కమిటీలు పనిచేస్తున్నాయని, ఈ కమిటీలు కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి వారికి వైద్యం అందించే కృషి చేస్తున్నారని, లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని హాస్పిటల్ లో చేర్పించి వారి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు వారికి కూడా మంత్రి సత్యవతి కృతజ్ణతలు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో అందరూ ప్రభుత్వ ఆంక్షలకు లోబడి ఉండాలని, నియమాలను అతిక్రమిస్తే కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు.

English summary
State Tribal and Women and Child Welfare Minister Satyavati Rathore said the state government was taking several steps to control the second phase of the corona epidemic.The minister said that the state of Telangana is implementing policies that no other state in the country has implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X