కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో వ్యాక్సినేషన్.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్.. కరీంనగర్‌లో మంత్రి గంగుల

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవాళ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో 139 కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎవరెవరీకి వ్యాక్సిన్ ఇవ్వాలి.. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.

వ్యాక్సినేషన్‌ కోసం ఖమ్మం జిల్లాలో ఆరు కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, సిటీలోని ముస్తఫా నగర్, వెంకటేశ్వర నగర్, బోనకల్, మధిర పట్టణం, సత్తుపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను వ్యాక్సినేషన్‌ వేస్తారు. జిల్లాలో 12800 మంది హెల్త్ వర్కర్స్‌ను గుర్తించారు. వీరి కోసం 1530 డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు.

vaccination likely start to telangana state..

ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల 14 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొంటారు. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చోట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ ఇతరులు పాల్గొనే అవకాశం ఉంది.

English summary
vaccination likely start to telangana state. minister puvvada ajay kumar participate kammam and gangula kamalakar participate karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X