• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూపర్ స్ప్రైడర్లందరికీ టీకాలు.!సీఎం ఆదేశాలు.!రంగంలో దిగిన ట్రబుల్ షూటర్.!

|

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా నియంత్రణ కోసం మొదట రాత్రి పూట కర్య్పూ అమలు చేసింది తెలంగాన ప్రభుత్వం. కానీ అది అంతగా ప్రయోజనం లేకపోడంతో లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే అత్యవసర సేవల కోసం కొన్ని శాఖలకు లాక్‌డౌన్ ఆంక్షలనుండి మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. అసలు చిక్కు ఇక్కడే ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

అత్యవసర సేవలందిస్తున్న వారితో ప్రమాదం.. వారికి టీకాలు వేయించాలన్న సీఎం కేసీఆర్..

అత్యవసర సేవలందిస్తున్న వారితో ప్రమాదం.. వారికి టీకాలు వేయించాలన్న సీఎం కేసీఆర్..

మినహాయింపులు ఇచ్చిన సంస్థల నుండి అనేక మంది రోడ్లమీద ఏదో ఒక పని కారణంతో రోడ్ల మీదకు రావడం జరుగుతోంది. అలాంటి వారిని అడ్డగించడానికి కూడా పోలీసులకు రైట్స్ లేవు. దీంతో వారి తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి అత్యవసర సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ వేస్తే కరోనా వ్యాప్తిని నియంత్రించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ స్పైడర్లుగా పిలవబడుతున్న వీరందరికి కరోనా వ్యాక్సీన్ వేస్తే పరిస్దితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అత్యవసరంగా సేవలు చేస్తున్నవారే సూపర్ స్పైడర్లు.. కట్టడి చేయాలని మంత్రి హరీష్ కు ఆదేశాలు..

అత్యవసరంగా సేవలు చేస్తున్నవారే సూపర్ స్పైడర్లు.. కట్టడి చేయాలని మంత్రి హరీష్ కు ఆదేశాలు..

అందులో భాగంగా సీఎం చంద్రశేఖర్ రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు కొన్ని సూచనలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అత్యవసర సేవల పేరుతో సూపర్ స్పైడర్లుగా సంచరిస్తున్న వారిని గుర్తించి టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఆర్ధిక మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అత్యవసర సేవల పేరుతో ఏ ఏ సంస్తల వ్యక్తుల ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు అనే అంశంపై క్షేత్ర స్దాయిలో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్.. సీఎస్ తో సమావేశం..

రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్.. సీఎస్ తో సమావేశం..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించి, సూపర్ స్ప్రేడర్లు అందరికీ టీకాలు వేసే అంశంపై చర్చించారు. ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయుటకు ఆదేశించారు.

కరోనా తీవ్రత తగ్గించడమే లక్ష్యం.. కఠినంగా ఉండాలంటున్న సీఎం..

కరోనా తీవ్రత తగ్గించడమే లక్ష్యం.. కఠినంగా ఉండాలంటున్న సీఎం..

సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

English summary
On the orders of the Chief Minister K Chandrasekhar, Finance Minister Harish Rao, along with the state Chief Secretary Somesh Kumar met in BRK Bhavan Tuesday, discussed the topic of vaccination for every super spider.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X