హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ ఆత్మహత్యకు కారణం..? ఆ నలుగురే కాదు.. మరో ఇద్దరు కూడా..?

|
Google Oneindia TeluguNews

శ్రీ వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ ఆత్మహత్యకు గల కారణం ఏంటీ..? ఆ నలుగురి వల్లే సూసైడ్ చేసుకున్నారా..? వారి మధ్య గొడవకు కారణమేంటి..? కేసు విచారణలో పోలీసులు వెలికితీసిన అంశాలెంటి..? అజయ్‌కు ఆస్ప్రతి భవన యాజమాని కరుణాకర్ రెడ్డితో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. దాంతోపాటు అతను మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు.

మెడికో అజయ్..

మెడికో అజయ్..

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపురం గ్రామానికి చెందిన కర్నాల అజయ్.. మెడిసిన్ చేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్‌లో ఫ్యామిలీతో ఉంటున్నారు. అతనికి భార్య శ్వేత, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సరసత్వీనగర్‌లో శ్రీ వైష్ణవి ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. భవన యాజమాని కరుణాకర్ రెడ్డితో మొదలైన వివాదం.. మానసిక సంఘర్షణకు గురై అజయ్ సూసైడ్ చేసుకునే వరకు వెళ్లింది. అయితే ఇందులో ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్, సిబ్బంది కూడా కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారని తెలిసింది.

రూ.10 లక్షలతో రెనొవేషన్

రూ.10 లక్షలతో రెనొవేషన్

సరసత్వీనగర్‌లో గల భవనాన్ని అజయ్ లీజుకు తీసుకున్నారు. భవనంలో మార్పులు చేయాలని యాజమాని కరుణాకర్ రెడ్డికి సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో రూ.10 లక్షలు వెచ్చించి తానే మార్పులు చేశాడు. దీంతో కరుణాకర్ రెడ్డితో విభేదాలు పొడచూపాయి. బిల్డింగ్ ఖాళీ చేయాలని గొడవకు పీక్‌కి చేరింది.

ఆ ముగ్గురు ఇన్‌వాల్వ్

ఆ ముగ్గురు ఇన్‌వాల్వ్

ఇందులో కరుణాకర్ రెడ్డి బావ కొండల్ రెడ్డి, సరస్వతీనగర్ ప్రెసిడెంట్ మేఘారెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ రంగంలోకి దిగి.. అజయ్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వారి టార్చర్ భరించలేకే అజయ్ సూసైడ్ చేసుకొన్నానని డైరీలో రాసుకొన్నారు.

కోర్టులో కేసు

కోర్టులో కేసు

తన భవనం ఖాళీ చేయాలని అజయ్‌పై కోర్టులో కరుణాకర్ రెడ్డి కేసు కూడా వేశారు. దీంతోపాటు ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ రమేశ్‌ను కరుణాకర్ రెడ్డి తనవైపునకు తిప్పుకొన్నారు. రమేశ్ గోవా వెళ్లి డబ్బులు పొగొట్టుకున్నా.. అజయ్ సాయం చేశాడు. కానీ ఆ మేలును కూడా మరచిపోయి రమేశ్ వ్యవహరించాడు. సిబ్బంది యాదగిరి రెడ్డి కూడా కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు. దీంతో తాను ఏకాకిని అయ్యానని భావించి, ఆత్మన్యూనత భావంతోనే సూసైడ్‌ చేసుకొని ఉంటాడు.

English summary
vaishnavi hospital md ajay suicide because of six members. police reveal another two person names.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X