హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'లవర్స్‌డే కాదు.. హనుమంతప్ప దేశభక్తి గొప్పది', అమ్మప్రేమ.. కాళ్లకు స్పీకర్ దండం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమ్మ ప్రేమ అనంతమైందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనా చారి ఆదివారం అన్నారు. రామకృష్ణమఠంలో భారత్ టుడే, శ్రీపీఠం ఆధ్వర్యంలో ప్రేమ్ దివస్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన శారీరకంగా ఎదుగుదల లేని మానసిక వికలాంగుడిని పెంచి పోషిస్తున్న తల్లి పేరమ్మ కాళ్లకు దండం పెట్టి జేబులో ఉన్న మొత్తం డబ్బులను ఆమెకు ఇచ్చిన అనంతరం మాట్లాడారు.

వెయ్యి పుస్తకాలు చదివినా అమ్మ ప్రేమకు నిర్వచనం చెప్పలేమన్నారు. అమ్మలకే హక్కులు, బాధ్యతలు తెలిసి ఉంటాయన్నారు. అమ్మ పట్ల భక్తి, ఆరాధన ఉండాలని యువతీయువకులకు సూచించారు. శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ... యువతీయువకుల మధ్య కలిగే ప్రేమనే ప్రేమ అనుకుంటే పొరపాటన్నారు.

ఇటీవల భారత సరిహద్దులను కాపలా కాస్తూ 25 అడుగుల లోతు మంచులో కూరుకుపోయినా దేశం కోసం ఆరురోజుల పాటు గుండె కొట్టుకున్న హనుమంతప్ప దేశప్రేమ గొప్పదన్నారు. మాతృభూమి రక్షణ కోసం దేశ సైనిక శక్తి పెరగవలసిన అవసరం ఉందన్నారు.

హాల్‌మార్క్‌ అనే వ్యాపార సంస్థ తమ గ్రీటింగ్ కార్డులను అమ్ముకునేందుకు తెలివిగా వాలెంటైన్‌ అనే వ్యక్తితో ముడిపెట్టి చేసిన ప్రచారం మాయలో పడిపోవడం నిజంగా తెలివిలేని పనే అవుతుందన్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద మాట్లాడుతూ... జీవితంలో చెడును వదిలేసి మంచిని తీసుకుని ముందుకు పోవాలన్నారు.

సంస్కృతి ఆలపించిన గజల్స్‌ ఆకట్టుకున్నాయి. యాసిడ్‌ దాడికి గురై బతుకుపోరాటంలో విజయం సాధించిన ప్రణీతను ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు పట్టాభిరాం సత్కరించారు. బాచుపల్లి సంతోష్‌కుమార్‌, గజల్‌ శ్రీనివాస్‌, మాజీ పోలీస్‌ అధికారి యోగానంద్‌, వల్లీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్, పరిపూర్ణానంద

స్పీకర్, పరిపూర్ణానంద

అమ్మ ప్రేమ అనంతమైందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనా చారి ఆదివారం అన్నారు. రామకృష్ణమఠంలో భారత్ టుడే, శ్రీపీఠం ఆధ్వర్యంలో ప్రేమ్ దివస్‌ కార్యక్రమం జరిగింది.

వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

ఓయూలో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఇండియన్‌ లవర్స్‌ యూనిటీ (ఐఎల్‌యూ) నాయకుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తామని ఐఎల్‌యూ ప్రకటించింది.

 వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

విద్యార్థి సంఘాల మధ్య శనివారం ఘర్షణ తలెత్తడంతో పోలీసు బలగాలను మోహరించి గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టం చేశారు.

 వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

ఐఎల్‌యూ నాయకులు వసతిగృహం ముందు వేడుకలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రేమికులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ... శాంతియుతంగా ప్రేమికులకు నివాళి అర్పించే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.

 వాలెంటైన్ డే పిక్చర్స్

వాలెంటైన్ డే పిక్చర్స్

ఐఎల్‌యూ నాయకులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని జరపడాన్ని ఏబీవీపీ వ్యతిరేకిస్తుండటంతో ముందస్తుగా అరెస్టులు చేశారు.

English summary
With Valentine’s Day celebrations taking place on Sunday, protests took place as Bhajarang Dal and Vishwa Hindu Parishad activists staged demonstrations against the day at several places in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X