వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ ఎందుకు చెప్పారో?, ఆధారాల్తోనే వచ్చా: 11రోజుల తర్వాత జూబ్లీ పీఎస్‌కు వనితా రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సినీనటుడు విజయసాయి భార్య వనితా రెడ్డి తెలిపారు. విజయసాయి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆమె వచ్చారు.

Recommended Video

పోలీసులకు లొంగిపోయిన.. విజయ్‌సాయి భార్య !

విజయసాయి ఆత్మహత్యకు భార్యాభర్తల మధ్య గొడవే కారణమా? లేక మరమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. అవసరమైతే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..: విజయ్ అక్రమసంబంధాలపై వనిత ఫొటోల సంచలనం <br>ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..: విజయ్ అక్రమసంబంధాలపై వనిత ఫొటోల సంచలనం

ఆధారాలు పోలీసులకు..

ఆధారాలు పోలీసులకు..

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా వనితా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పిస్తానని, వాటిని పరిశీలించిన తర్వాత పోలీసులు ఏం చెబితే.. దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పోలీసులు నోటీసులిచ్చారు కాబట్టి.. తన వాదనను వినిపించేందుకు వచ్చానని తెలిపారు.

11ఎక్కడికీ పారిపోలేదు..

11ఎక్కడికీ పారిపోలేదు..

విజయ్ ఆత్మహత్య అనంతరం తాను 11 రోజులపాటు ఎక్కడికీ వెళ్లలేదని, తన కూతురు గురించే దూరంగా ఉన్నానని తెలిపారు. తాను దూరంగా ఏటూ పారిపోలేదని, ఎలాంటి నేరం చేయలేదని వనితా రెడ్డి చెప్పారు. విజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తనకు కూడా తెలియాల్సి ఉందని అన్నారు.

విజయ్ ఎందకలా చేశాడో?

విజయ్ ఎందకలా చేశాడో?

మూడేళ్లుగా దూరంగా ఉంటున్న తన పేరును చెప్పి.. విజయ్ ఆత్మహత్య చేసుకోవడం తనకు కూడా అర్థం కాలేదని వనితా రెడ్డి అన్నారు. విజయ్‌ని బ్యాడ్ చేయాలని తాను ఇతర అమ్మాయిలతో అతను ఉన్న ఫొటోలు విడుదల చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే వాటిని బయటపెట్టానని తెలిపారు.

అత్తామామల వేధింపులు.. ఫొటోలు అందుకే

అత్తామామల వేధింపులు.. ఫొటోలు అందుకే

తన అత్తామామలు కూడా తనను వేధింపులకు గురిచేస్తున్నారని, అందరికీ తెలియాలనే విజయ్ ఫొటోలు బయటపెట్టానని చెప్పారు. ఆ అమ్మాయిల భవిష్యత్ గురించి ఆలోచించాను కాబట్టే.. ఇప్పటివరకు తాను ఆ ఫొటోలను బయటపెట్టలేదని వనితా రెడ్డి తెలిపారు. తాను విజయ్‌పై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పడానికే తాను పోలీసుల ముందుకు వచ్చానని వనితారెడ్డి చెప్పారు.

 లొంగిపోవాలంటే..

లొంగిపోవాలంటే..

తనకు శశిధర్ ఎవరో తెలియదని అన్నారు. తన తరపున వాదించే అడ్వకేట్ శ్రీనివాస్ అని చెప్పారు. తన తండ్రే తనకు షిప్టు కారు ఇచ్చారని వనితారెడ్డి తెలిపారు.
పోలీసులకు అన్ని వివరాలు చెబుతానని, విచారణ తర్వాత వాళ్లు లొంగిపోవాలంటే అలాగే చేస్తానని వనితా రెడ్డి తెలిపారు. తాను విజయ్‌పై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని మరోసారి చెప్పారు. అంతకుముందు ఆమె భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టుకున్నారు.

English summary
Vanitha Reddy on Wednesday reached Jubilee Hills police station in Cine Actor Vijay Sai suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X