హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక నేనేం చేయాలి, ఆత్మబలిదానం చేసుకుంటా: వంటేరు, టీడీపీ-కాంగ్రెస్ కలయికపై దిమ్మతిరిగే షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఆత్మబలిదానానికి కూడా సిద్ధమని మహాకూటమి పొత్తులో భాగంగా గజ్వెల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, జాయింట్ సీఈవో ఆమ్రపాలిని కలిశారు. గజ్వెల్ తెరాస పైన, అధికారులు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గజ్వెల్ నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు తెరాసకు వత్తాసు పలుకుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్ ట్యాప్ చేస్తూ తన పక్కనే సివిల్ పోలీసులను పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, కేసీఆర్ వచ్చాక నాపై 23 కేసులు

నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, కేసీఆర్ వచ్చాక నాపై 23 కేసులు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తన పైన 23 కేసులు నమోదయ్యాయని వంటేరు చెప్పారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు. 450 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేసీఆర్ ఒక్కరిని కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. మూసాయిపేట రైలు ప్రమాద మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని కూడా పరామర్శించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్న సాగర్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వలేదని చెప్పారు.

337 ఎకరాలు ఉంటే 57 ఎకరాలని మాత్రమే చెప్పారు

337 ఎకరాలు ఉంటే 57 ఎకరాలని మాత్రమే చెప్పారు

కేసీఆర్ ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని, పోలీసులు అక్కడ ఎందుకు తనిఖీ చేయడం లేదని సీఈవో దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా అన్నారు. గజ్వెల్‍‌లో ఒక్క తెరాస నేత వాహనాన్ని అయినా సీజ్ చేశారా అని ప్రశ్నించారు. ఎర్రవల్లిలో దాదాపు 300 ఎకరాలు ఉంటే కేసీఆర్ 55 ఎకరాలు మాత్రమే అధికారికంగా ప్రకటించారని చెప్పారు.

గజ్వెల్లో ఆత్మబలిదానం చేసుకుంటా

గజ్వెల్లో ఆత్మబలిదానం చేసుకుంటా

పోలీసులు, ఎన్నికల అధికారుల్లో మార్పు రావాలని లేదంటే గజ్వెల్ ఆర్వో కార్యాలయం ఎదుట ఆత్మబలిదానం చేసుకుంటానని హెచ్చరించారు. తనపై లాఠీ దెబ్బలు పడ్డాయని, తూటాలు పేల్చారని, 307 కేసులు పెట్టారని, ఇబ్బందులు పెట్టారని, జైల్లో పెట్టారని, అయినా పోరాటం చేశానని చెప్పారు. ఓయులో మురళీ ముదిరాజ్ అనే యువకుడు ఉద్యోగా రాక చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్లానని, వారికి ఆర్థిక సాయం చేయాలని కోరితే, ఆ ఒక్క సంఘటనలోనే తనపై నాలుగు కేసులు పెట్టారని చెప్పారు.

మీడియాకు సంకేళ్లు

మీడియాకు సంకేళ్లు

ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అనే ఇద్దరు వారు చనిపోతే, దీనిపై ఇప్పటి వరకు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించలేదని, వారి కుటుంబాలను రోడ్డుపై పడ్డారని వంటేరు వాపోయారు. తాను ఎప్పుడు ఫైట్ చేసినా జైల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు. అక్కడ పోలీసులు, ఎన్నికల అధికారులు నిర్వీర్యంగా మారారని చెప్పారు. మీడియాను కూడా భయపెట్టి సంకెళ్లు వేశారన్నారు. అందరి టెలిపోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, తనది, తన భార్యది, ఇంట్లోని తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు. తన చుట్టూ సివిల్ పోలీసులు ఉన్నారన్నారు.

నీ ఫాంహౌస్‌లో సోదాలు జరగట్లేదేం

నీ ఫాంహౌస్‌లో సోదాలు జరగట్లేదేం

కేసీఆర్.. నీ ప్రగతి భవన్లో, నీ ఫాంహౌస్‌లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిపై పోలీసులు ఎందుకు దాడి చేయడం లేదని వంటేరు ప్రశ్నించారు. నేను ఇదే విషయాన్ని డీజీపీని సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. నా ఇంటి మీద, నా వ్యక్తుల మీద సోదాలు చేస్తున్నారని, కానీ తెరాస నేతల ఇళ్లపై ఎందుకు దాడులు చేయడం లేదన్నారు. మీ పోలీసోళ్లే మద్యం తీసుకు వెళ్లి సరఫరా చేస్తున్నారన్నారు. పోలీసుల జీపులలో డబ్బులు, మద్యం తీసుకెళ్తుంటే ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకున్నదని చెప్పారు. ఇక నేను ఎవరిని అడగాలన్నారు. మీడియాను బెదిరిస్తున్నారన్నారు.

నేనేం చేయాలి..

నేనేం చేయాలి..

ఇక నేనేం చేయాలని వంటేరు ప్రశ్నించారు. అందుకే ఆమరణ దీక్షకు కూర్చున్నానని చెప్పారు. అసలు నేను గెలవాలా.. వద్దా అన్నారు. 2009లో కేవలం మూడు వేల ఓట్లతో, 2014లో కేవలం 17వేల ఓట్లతో ఓడిపోయానని చెప్పారు. ఆ రోజు కుమ్మక్కై తనను ఓడించారని చెప్పారు. తాను ఈసారి కచ్చితంగా గజ్వెల్‌లో గెలుస్తున్నానని చెప్పారు. 2001లో కేసీఆర్ ఆస్తులు ఎంత, 2018లో ఎంతనో చెప్పాలని ప్రశ్నించారు. వేల ఎకరాలు, బినామీ ఆస్తులు ఉన్నాయన్నారు. ఫాంహౌస్‌లో విపరీతంగా డబ్బు ఉందని చెప్పారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అన్నారు. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ జీరో అయ్యాయని, జ్యూడిషియల్ ట్యాప్ చేస్తున్నారని, మీడియాకు సంకెళ్లు వేశారన్నారు. ఇక ఎవరు కాపాడాలన్నారు.

 టీడీపీ, కాంగ్రెస్ కలవడంపై కౌంటర్

టీడీపీ, కాంగ్రెస్ కలవడంపై కౌంటర్

నాడు తెలంగాణ రాష్ట్రం కోసం జెండాలను, అజెండాలను పక్కన పెట్టి ఉద్యమం చేశామని వంటేరు గుర్తు చేశారు. ఇవ్వాళ వచ్చిన తెలంగాణను కాపాడేందుకే తాము జెండాలను పక్కన పెట్టి పని చేస్తున్నామని చెప్పారు. తద్వారా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలవడంపై తెరాసకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేని పరిస్థితుల్లో తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నానని చెప్పారు. అందుకే నిన్న దీక్షలో కూర్చున్నానని చెప్పారు.

నా ప్రాణం పోతే పోయింది

నా ప్రాణం పోతే పోయింది

తన ప్రాణం పోతే పోయిందని, కనీసం ఈ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు కనువిప్పు కలగాలని వంటేరు అన్నారు. అందరికీ కనువిప్పు కావాలన్నారు. ప్రతి ఒక్కరు కమర్షియల్‌గా ఆలోచించడం వల్లే రాజకీయాలు భ్రష్టు పట్టాయన్నారు. ఆ రాజకీయాలను ప్రక్షాళణ చేయాలని తన ప్రాణం పోతే పోయిందని, అందరికీ జ్ఞానోదయం కావాలని దీక్షకు కూర్చున్నానని చెప్పారు. కానీ అక్కడకు పోలీసులు వచ్చి వేధించి, పోలీసు స్టేషన్లో పెట్టారన్నారు. తనకు మూడు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదని, తినడానికి కూడా టైం లేదన్నారు.

English summary
Telangana Congress Party leader and Gajwel Mahakutami candidate Vanteru Pratap Reddy fired at Telangana Caretaker CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X