వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జిల్లాల అధ్యక్షులు వీరే: కాంగ్రెస్‌లోకి ఒంటేరు, ‘కేసీఆర్‌ను ఓడిస్తా’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సహా పలువురు నేతలు శుక్రవారం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియా, షబ్బీర్‌ అలీ, సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని వెల్లడించారు. ఒంటేరు ప్రతాప్‌ రెడ్డిలాంటి నేతల చేరికతో తమ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.

 కేసీఆర్‌ను ఓడిస్తా..

కేసీఆర్‌ను ఓడిస్తా..

టీఆర్ఎస్ నేతల బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా నీతి, నిజాయతీ ఉన్న కాంగ్రెస్‌లో తాను చేరినట్టు ఒంటేరు తెలిపారు. 2019లో గజ్వేల్‌ నుంచి పోటీచేసి గెలిచి కాంగ్రెస్‌ పార్టీకి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ప్రజల మద్దతుతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని చెప్పారు.

టీఆర్ఎస్ పాలనపై విమర్శలు

టీఆర్ఎస్ పాలనపై విమర్శలు

ఓయూలో తమ స్వగ్రామానికి చెందిన విద్యార్థి మురళీ ముదిరాజ్‌ చనిపోతే పరామర్శకు వెళ్లిన తనను ప్రభుత్వం నెల రోజులపాటు జైలుపాలు చేసిందని ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్‌, షబ్బీర్‌ అలీ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ నియమించింది. రాష్ట్రంలోని జిల్లాలు, నగరాలకు కలిపి కొత్తగా 11 మంది డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమిస్తూ ప్రకటన జారీ చేశారు.

 కొత్త డీసీసీ అధ్యక్షులు వీళ్లే..

కొత్త డీసీసీ అధ్యక్షులు వీళ్లే..

హైదరాబాద్‌ నగర డీసీసీ అధ్యక్షుడు - అంజన్‌కుమార్‌ యాదవ్‌

మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలు - వి. సునీతా లక్ష్మారెడ్డి ‌
నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు - తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌‌ ‌
కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు - కటకం మృత్యుంజయం
ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు - అల్లేటి మహేశ్వర్‌ రెడ్డి
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు - క్యామ మల్లేశ
మహబూబ్‌నగర్‌డీసీసీ అధ్యక్షుడు - ఓబేదుల్లా కొత్వాల్‌ ‌
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు - బూడిద భిక్షమయ్య గౌడ్‌
వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు - నాయిని రాజేందర్‌రెడ్డి
నిజామాబాద్‌ నగర డీసీసీ అధ్యక్షుడు - కేశ వేణు
కరీంనగర్‌నగర డీసీసీ అధ్యక్షుడు - కర్ర రాజశేఖర్‌
వరంగల్‌ నగర డీసీసీ అధ్యక్షుడు - కడారి శ్రీనివాసరావు
రామగుండం నగర డీసీసీ అధ్యక్షుడు - లింగస్వామి యాదవ్‌‌లు నియామకమయ్యారు.

English summary
TDP leader Vanteru Pratap Reddy joined Congress party on Friday on the presence of the president Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X