వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటేరు ప్రతాప్‌రెడ్డి బాబుకు షాకిస్తారా, సైకిల్ దిగనున్న నేతలు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ టిడిపి ఇంచార్జీ వంటేరు ప్రతాప్‌రెడ్డి టిడిపిని వీడే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఓయూ కేసులో పార్టీ నాయకత్వం ప్రతాప్‌రెడ్డిని పట్టించుకోలేదనే అసంతృప్తితో ఉన్నారు.ఈ తరుణంలో ప్రతాప్ రెడ్డి టిడిపిని వీడే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది ప్రతాప్ రెడ్డితో పాటు మరో నేత కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది.

2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో టిడిపి 15 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టిడిపి నుండి ఎమ్మెల్యేలు, ఎంపీ టిఆర్ఎస్ లో క్యూ కట్టారు. 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిడిపిలో ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కొనసాగుతున్నారు

సండ్ర వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే టిడిపిలో ఉన్నారు. మిగిలినవారంతా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఉన్న కొద్ది మంది నేతలు కూడ ఇతర పార్టీల్లోకి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పనున్నారా

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పనున్నారా

ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిడిపిని వీడనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఓయూ లో విద్యార్థి ఆత్మహత్య కేసులో విద్యార్థులకు సంఘీభావం తెలిపే సందర్భంలో కేసులు నమోదయ్యాయి అయితే ఆ సందర్భంగా నమోదైన కేసుల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి చంచల్ గూడ జైల్లో గడిపారు అయితే ఆ సమయంలో పార్టీ నాయకత్వం ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పట్టించుకోలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. దీంతో పార్టీ మారాలనే ఆలోచనలో ప్రతాప్ రెడ్డి ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

గజ్వేల్ లో సరైన కాంగ్రెస్ లీడర్ లేరు

గజ్వేల్ లో సరైన కాంగ్రెస్ లీడర్ లేరు

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్సారెడ్డి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. నర్సారెడ్డికి కెసిఆర్ కార్పోరేషన్ పదవిని కట్టబెట్టారు. గత ఎన్నికల సమయంలో కెసిఆర్ కు ప్రతాప్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేని కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతాప్ రెడ్డితో సంప్రదింపులు చేస్తోందని సమాచారం టిడిపి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రతాప్ రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.రేవంత్ రెడ్డి టిడిపిని వీడిన సమయంలో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ఆ సమయంలో తాను టిడిపిని వీడబోనని ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. టిడిపిలోనే కొనసాగుతున్నారు.

టిడిపిని వీడనున్న మరికొందరు నేతలు

టిడిపిని వీడనున్న మరికొందరు నేతలు

తెలంగాణలో మరికొందరు నేతలు టిడిపిని వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రతాప్ రెడ్డితో పాటే మరో కీలక నేత కూడ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో టిడిపికి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావును టిఆర్ఎస్‌లో చేరాలని ఆ పార్టీ నాయకత్వం ఒత్తిడి తెస్తోందని ప్రచారం సాగుతోంది. మండవ వెంకటేశ్వర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను కూడ టిఆర్ఎస్ నేతలు సంప్రదించారనే ప్రచారం సాగుతోంది అయితే వారు కూడ టిడిపిని వీడుతారనే ప్రచారం కూడ సాగుతోంది.ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఈ ప్రచారాన్ని వారిద్దరూ కూడ ఖండించారు.

నెలాఖరులో తెలంగాణ నేతలతో బాబు మీటింగ్

నెలాఖరులో తెలంగాణ నేతలతో బాబు మీటింగ్

ఫిబ్రవరి 28వ, తేదిన తెలంగాణ నేతలతో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేయనున్నారు. పార్టీని వీడిన నేతల స్థానాల్లో కొత్త వారితో పార్టీ ఇంచార్జీలను నియమించుకోవడం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు

English summary
There is a spreading a rumour Tdp leader Vanteru Pratap Reddy likely to join in Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X